»   » షాక్: తన ఆస్తి మొత్తాన్ని దానం చేసిన సీనియర్ స్టార్!

షాక్: తన ఆస్తి మొత్తాన్ని దానం చేసిన సీనియర్ స్టార్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా రంగంలో ఉన్న స్టార్స్ కోట్లు సంపాదించడం అనేది ఈ రోజులు సర్వసాధారణమైన విషయమే. తాము సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సేవ కార్యక్రమాలకు వినియోగించడం లాంటివి కూడా చేస్తున్నారు. వీరు చేస్తున్న దాంట్లో సేవా భావంతో పాటు.... ఇలాంటి కార్యక్రమాల ద్వారా పబ్లిసిటీ పెంచుకోవాలనే స్వార్థం కూడా ఉంటుందనేది ఎవరూ కాదనలేని నిజం.

అయితే తాజాగా ఓ సినీ స్టార్ ఏకంగా తన ఆస్తి మొత్తాన్ని దానం చేసాడు. పద్మభూషన్ అవార్డు గ్రహీత, బాలీవుడ్ లెజెండరీ సంగీత దర్శకుల్లో ఒకరైన మహ్మద్ జహూర్ ఖయ్యమ్ హష్మీ తాజాగా తన ఆస్తి మొత్తాన్ని జూనియర్ ఆర్టిస్టుల సంఘానికి దానం చేసారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 Mohammed Zahur Khayyam Hashmi donates his entire wealth to aid budding artists

మహ్మద్ జహూర్ ఖయ్యమ్ హష్మీ కూడా సినిమా రంగంలో అడుగు పెట్టిన తొలి నాళ్లలో ఎన్నో కష్టాలు పడ్డ వారే. అంచెలంచెలుగా తన టాలెంటుతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు బాలీవుడ్ సినిమాలకు మధురమైన సంగీతాన్ని అందించారు. తనలాగే సినిమా రంగంలో అడుగు పెట్టి కష్టాలు పడుతున్న జూనియర్ ఆర్టిస్టులకు చేయూతనివ్వాలనే ఉద్దేశ్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

తన ఆస్తి మొత్తాన్ని జూనియర్ ఆర్టిస్టుల సేవా సంఘానికి రాసిస్తున్నట్లు ప్రకటించారు. ఖయ్యమ్ ఆస్తి విలువ దాదాపు 10 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. చిత్ర పరిశ్రమలో ఉన్నత స్థాయికి రావాలనే కాంక్షతో పొట్ట చేత్తో పట్టుకుని వచ్చే కళాకారులకు అండగా నిలవాలన్న ఆయన నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

English summary
Bollywood Legendary music director Mohammed Zahur Khayyam Hashmi donates his entire wealth to aid budding artists.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu