»   » భారీ సెట్టింగ్స్ మధ్య మోహన్ బాబు 40 వసంతాల వేడుక!

భారీ సెట్టింగ్స్ మధ్య మోహన్ బాబు 40 వసంతాల వేడుక!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాధారణ వ్యక్తిగా తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతి శిఖరాలను అధిరోహించి తెలుగువారికి అభిమాన నటుడయ్యారు. నటజీవితంలో నలభై వసంతాలను పూర్తి చేసుకుని ఈ తరం నటులకు ఆదర్శప్రాయంగా నిలిచారు.

నటుడిగా, నిర్మాత, విద్యావేత్తగా, రాజకీయవేత్తగా, అన్నింటికీ మించి మంచి మనసున్న వ్యక్తిగా ఇలా పలు రంగాల్లో తనదైన శైళిలో అద్భుతంగా రాణించి భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. అలాగే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుండి గౌరవ డాక్టరేటు అందుకున్నారు. ప్రస్తుతం కుమారులు విష్ణు, మనోజ్, కుమార్తె లక్ష్మీ ప్రసన్న మోహన్ బాబు అడుగు జాడల్లో నడుస్తూ సినీ రంగంలో రాణిస్తున్నారు.

Mohan Babu 40 years Celebrations

మోహన్ బాబు సినీ రంగంలో నటుడిగా 40 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు పలు కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే మోహన్ బాబు 40 నట వసంతాల వేడుకను వైజాగ్ లో సెప్టెంబర్ 17న కలకాలం గుర్తుండి పోయేలా భారీ సెట్ వేసి టి.సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ వేడుకలో మూడు కార్యక్రమాలను నిర్వహిస్తారు. అందులో మొదటిది మోహన్ బాబు సినిమాలలోని బెస్ట్ 60 సాంగ్స్ ఉన్న సీడీని విడుదల చేయడం. సూపర్ స్టార్ రజనీకాంత్ ముందుమాట రాసిన బెస్ట్ సీన్స్ ఆఫ్ పెదరాయుడు పుస్తకాన్ని విడుదల చేస్తారు. చివరిగా మోహన్ బాబు వ్యక్తిగత, సినీ, రాజకీయ జీవితానికి సంబంధించిన అరుదైన ఫోటోతో కూడిన బుక్ ను విడుదల చేస్తారు.

English summary
30th August, Hyderabad: MB40, one of the most speculated events in the Tollywood film circle, is scheduled for September 17th in Vizag. A huge set is being planned to host the event. The event is much in news and if sources are to be believed, will be an occasion to remember for a long time.Among the many celebrations, MB40 will have three categorically significant programs. To begin with, the event will see the launch of an audio CD that will comprise of 60 of the most celebrated songs from Mohan Babu’s 40 years run in the South Indian film industry.
Please Wait while comments are loading...