»   » వైజాగ్ లో టి.సుబ్బరామిరెడ్డి అధ్వర్యంలో మోహన్ బాబు 40 సినీ వసంతాల వేడుక

వైజాగ్ లో టి.సుబ్బరామిరెడ్డి అధ్వర్యంలో మోహన్ బాబు 40 సినీ వసంతాల వేడుక

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాధారణ వ్యక్తిగా తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతి శిఖరాలను అధిరోహించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అభిమాన నటుడయ్యారు. నటజీవితంలో నలభై వసంతాలను పూర్తి చేసుకుని ఈ తరం నటులకు ఆదర్శప్రాయంగా నిలిచారు.

Mohan Babu 40 Years Industry Massive Celebrations in Vizag by TSR

నటుడిగా, నిర్మాత, విద్యావేత్తగా, రాజకీయవేత్తగా, అన్నింటికీ మించి మంచి మనసున్న వ్యక్తిగా ఇలా పలు రంగాల్లో తనదైన శైళిలో అద్భుతంగా రాణించి భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. అలాగే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుండి గౌరవ డాక్టరేటు అందుకున్నారు. ప్రస్తుతం కుమారులు విష్ణు, మనోజ్, కుమార్తె లక్ష్మీ ప్రసన్న మోహన్ బాబు అడుగు జాడల్లో నడుస్తూ సినీ రంగంలో రాణిస్తున్నారు.

Mohan Babu 40 Years Industry Massive Celebrations in Vizag by TSR

మోహన్ బాబు సినీ రంగంలో నటుడిగా 40 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు పలు కార్యక్రమాలను నిర్వహించారు. అంతే కాకుండా ఇప్పుడు టి.సుబ్బరామిరెడ్డి ఈ వేడుకను వైజాగ్ లో సెప్టెంబర్ 17న ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకు పలువురు ఉత్తరాది, దక్షిణాదికి చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. ఇప్పటి వరకు ఎవరూ జరపనంత ఘనమైన వేడుకను నిర్వహించాలని నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Manchu Bhaktavatsalam Naidu, popularly known to Telugu people as Manchu Mohan Babu is a house hold name. He is identified as family member in two Telugu states. Grown from a common man to super power, Mohan Babu’s personal and professional journey has many crowning moments and lowest points but his courageous attitude, valiant nature and friendly character serves deep inspiration for present generation to steer better life.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu