నిజమా? మోహన్ బాబు తన కొడుకును అలా...!

By Bojja Kumar

'నా పెద్ద కొడుకు విష్ణుని సిన్సియర్ అండ్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ చేయాలనుకున్నాను. కానీ వాడు తన అభీష్టం మేరకు హీరో అయ్యాడు. అయితే...నేను విష్ణుని ఎలా చూడాలనుకున్నానో, 'అనుక్షణం' చిత్రంలో వర్మ అలా చూపించాడు. అసలు నేను వర్మను 'డార్లింగ్' అని ఎందుకు అంటానో 'అనుక్షణం' సినిమా చూసిన తరువాత అందరికీ అర్థమవుతుంది' అన్నారు మోహన్ బాబు.

ఇటీవల ఆయన 'అనుక్షణం' చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...'చిన్నతనంలో నేను ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువగా చూసేవాడ్ని. అయితే బాష రాక పోవడం వల్ల పక్క వాళ్ల ఎక్స్ ప్రెషన్ ని బట్టి సదరు చిత్రాన్ని ఆస్వాదించేవాడ్ని. ఆ టైంలో అనిపించేది..ఇటువంటి సినిమాలు తెలుగులో వస్తే ఎంత బాగుంటుందో అని. 'అనుక్షణం' అటువంటి చిత్రమే.

Mohan babu About ANUKSHANAM

సినిమా మొదలైనప్పటి నుండి ఎండింగ్ టైటిల్స్ పడేంత వరకు టైటిల్ కు తగ్గట్లుగా 'అనుక్షణం' ఉత్కంఠభరితంగా సాగుతుంది. మనకున్న లెజెండరీ డైరెక్టర్లలో వర్మ ఒకరని అందరికీ తెలుసు. వర్మ స్థాయిని వంద రెట్లు పెంచే చిత్రం 'అనుక్షణం'. ఐపిఎస్ ఆఫీసర్ గా విష్ణు, సైకాలజిస్టుగా రేవతి క్యారెక్టర్లను వర్మ మలిచిన విధానం, వారి నుండి అద్భుతమైన నటనను రాబట్టిన వైనం నన్ను ఆశ్చర్యానికి గురి చేసాయి. ఇవన్నీ నేను నా కొడుకు సినిమాని ప్రమోట్ చేయడం కోసమో, లేదా 'అనుక్షణం' చిత్రానికి హైప్ తీసుకురావడం కోసమో చెబుతున్న కబుర్లు కావు, కేవలం 'అనుక్షణం' సినిమా చూసిన తరువాత నాకేమనిపించిందో అదే ఇక్కడ అక్షర రూపంలో పొందు పరిచాను' అన్నారు.

ఏ,వి.ఆర్ట్స్ పతాకంపై 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సమర్పణలో పార్థ సారథి, గజేంద్ర నాయుడు, విజయ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తేజస్వి, మధుశాలిని, బ్రహ్మానందం, నవదీప్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 12న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X