ఉన్నవి రెండే కులాలు.. వారసులేంటి? వారసత్వమేంటి?.. మోహన్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే తెలియని తెలుగు ప్రేక్షకులుండరు. ఆయనకు మాత్రమే చెందే ప్రత్యేకమైన డైలాగ్ డెలివరి, యాక్షన్ స్టైల్ ఎప్పటికీ ప్రేక్షకుల్లో నిలిచే ఉంటుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించడమే కాదు నిర్మించి తన సత్తాను చాటాడు. అయితే గత కొన్నేళ్లుగా మాత్రం విజయమనేది అందని ద్రాక్షలా తయారైంది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ బాబు ఆసక్తికరమైనా కామెంట్స్ చేశారు.

ఉన్నవి రెండే కులాలు..
‘ఇప్పుడున్న కులాలు రెండే రెండు.. పాజిటివ్ మరియు నెగిటివ్.. పదవీ అహంకారంతో ఉండే ఎవరైనా ఇది అర్థం చేసుకుంటే చాలు. జీవితాంతం గొప్పగా ఉంటాడు. అది ఎవరైనా సరే. అది తెలుసుకోవడానికే వచ్చింది కరోనా' అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు మోహన్ బాబు.

ఇంతకంటే శిక్ష ఏముంటుంది..?
బాంబ్ వేస్తే ఒక రోజులో చచ్చిపోతామని కానీ మనందరం ప్రతి క్షణం చచ్చి బతుకుతున్నామని తెలిపాడు. ఏ క్షణంలో ఎవరికి వస్తుందో ఏమిటో తెలియని పరిస్థితిలో ఉన్నామని అన్నాడు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎలా వస్తుందో తెలియదని. తల్లి బిడ్డలు భార్యాభర్తలను విడగొడుతోందని ఇంతకంటే శిక్ష ఏముంటుందని పేర్కొన్నాడు. అందరూ ఇకనైనా తెలుసుకుని మారాల్సిన టైమ్ వచ్చిందని హెచ్చరించాడు.

వారసత్వం అనే పదమే..
వారసత్వం అనే పదమే తనకు ఇష్టం లేదని.. అసలు ఎవడికి కావాలి వారసత్వం అంటూ సెన్సేషనల్ కామెంట్ చేసాడు మోహన్ బాబు. విష్ణు.. మనోజ్.. లక్ష్మి తన పిల్లలుగా ఉండాలని రాసిపెట్టి ఉంది వచ్చారంతే.. వారసులేంటి.. వారసత్వం ఏంటి అంటూ ఫైర్ అయ్యాడు.
Recommended Video

ఎవడెక్కడ సక్సెస్ కావాలో..
మనోజ్‌కు నటన అంటే ఇష్టం కానీ విష్ణుకు మాత్రం బిజినెస్‌పై మక్కువ ఎక్కువ అని చెప్పాడు కలెక్షన్ కింగ్. ఇక మంచు లక్ష్మి కూడా నటనలోనే కొనసాగాలని చూస్తుందని చెప్పాడు ఈయన. వారసుల గురించి మీ కామెంట్స్ అంటే నో కామెంట్స్ అన్నాడు ఈయన. మొత్తానికి వారసత్వం అనేది తనకు నచ్చని పదమని చెప్పాడు. ఎవడెక్కడ సక్సెస్ కావాలని రాసుంటే అక్కడికి వస్తాడని చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా మోహన్ బాబు చెప్పే సమాధానాలు, ముక్కుసూటితనాని నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.


Click it and Unblock the Notifications











