సినీ రంగంలో కుల గజ్జిపై మోహన్ బాబు....
కుల గజ్జి సినిమా రంగంలోనూ విస్తరించిందని, రెండు కులాలకు చెందిన హీరోల మధ్య ఆధిపత్య పోరు సాగుతుందని, అభిమానులు కూడా సదరు హీరోలపై కులాభిమానం చూపిస్తూ ఇతర కులం హీరోలపై దుష్ట్ర్పచారం చేస్తున్నారని, ఈ పరిణామాల కారణంగా తెలుగు సినిమా నష్టాల బాట పడుతుందని ఇటీవల మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇటీవల తనకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఈ ప్రస్తావన తీసుకొచ్చారు మోహన్ బాబు. ఇలాంటి పరిణామాలు అనారోగ్య వాతావరణానికి దారి తీస్తాయన్నారు. కులాన్ని అడ్డం పెట్టుని పైకి రావాలని చూడటం మూర్ఖత్వం అనే రీతిలో మోహన్ బాబు వ్యాఖ్యానించారు. కొందరు రాజకీయ నాయకులు కులం పేరుతో అగ్గి పెడుతున్నారని విమర్శించారు.
సుబ్బిరామి రెడ్డి లలిత కళా పరిషత్ నెల్లూరు శాఖ ప్రారంభోత్సవం సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా మోహన్ బాబును నట వాచస్సతి బిరుదుతో సన్మానించారు. నిజాలు నిర్భయంగా మాట్లాడడం తనకు తెలుసునని మోహన్‌బాబు చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం మోహన్ బాబు 'రావణ' అనే భారీ మైథలాజికల్ సినిమాలో నటించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. కె. రాఘవేంద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన భారీ తారాగణంతో రిచ్‌గా ఈ చిత్రాన్ని రూపొందించడానినికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











