twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్,చిరంజీవిల గురించి మోహన్ బాబు...

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఇవాళ ఒక్క సినిమా హిట్టయితే 'నేనే ముఖ్యమంత్రి' అనుకునే వాళ్లున్నారు. కానీ అది కొంతమందికే చెల్లింది. సినిమా వేరు. రాజకీయం వేరు. ప్రజలకు నిజంగా మేలు చేసేవాడే రాజకీయ నాయకుడు. అటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు మోహన్ బాబు. 'మేజర్ చంద్రకాంత్' వచ్చి 20 ఏళ్లయిన సందర్భంగా ఆయన తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు

    'అసెంబ్లీ రౌడి' వేడుకలో.. 'ఏక గర్భమున జన్మించక పోయినా మేం అన్నదమ్ములం' అన్నారు నా గురించి. ఆ మహానుభావుడు నన్ను రాజ్యసభకు కూడా పంపించారు. అటువంటి వ్యక్తి విషయంలో కొన్ని చెప్పుడు మాటలు విని ఆయనకు దూరంగా రావాల్సి వచ్చింది తప్ప ఆయనపై ప్రేమలేక కాదు. ఆయనను కాదనుకున్న వ్యక్తుల్లో నాతో పాటు ఇంద్రారెడ్డి, దేవినేని నెహ్రూ, పరిటాల రవి కూడా ఉన్నారు అని చెప్పారు.

    ఇక ''అన్నయ్య ఎన్టీఆర్‌ హీరో గా నటించిన 'సామ్రాట్‌ అశోక'లో నేనొక చిన్న పాత్ర చేశాను. ఓ రోజు సెట్‌లో ఉన్నప్పుడు 'అన్నయ్యా... నేను మీతో సినిమా నిర్మించాలనుకొంటున్నాను' అన్నాను. ఆ మాట వినగానే పెద్దగా నవ్వుతూ... 'నాతో సినిమా ఏమిటి? మీరు జోక్‌ చేస్తున్నారా?' అన్నారు. 'లేదు నిజంగానే చెబుతున్నాను, రాఘవేంద్రరావుగారు దర్శకుడు' అని చెప్పాను. ఆయన రేపు మాట్లాడదాం అని చెప్పి వెళ్లిపోయారు. ఆ రోజు నాకు షూటింగ్‌ లేదు. కానీ సెట్‌కి వెళ్లి ప్రస్తావించాను. 'మొన్న జరిగిన ఎన్నికల్లో నేను గెలవలేదు. ఓడిపోయాను. ఇప్పుడు సినిమా ఏమిటి? ఎవరు చూస్తారు?' అన్నారు. 'మిమ్మల్నే చూడకపోతే ప్రేక్షకులు ఇంకెవరిని చూస్తారు? మీరు ఊ అనండి. నేను సినిమా తీస్తాను' అన్నాను. అప్పుడు 'సరే కథ తీసుకురండి' అన్నారు. అలా మేజర్‌ చంద్రకాంత్‌కి శ్రీకారం చుట్టాం''. అన్నారు.

    అలాగే చిరంజీవి నా మిత్రుడు. కేంద్రమంత్రిగా సంతోషంగా పనిచేస్తున్నాడు. పేపర్లలో చూస్తున్నాను, అతని గురించి అన్నీ మంచి విషయాలే కనిపిస్తున్నాయి అన్నారు. ఇప్పుడు ఏ పార్టీలోనూ లేను. రానున్న రోజుల్లో ఏ పార్టీలో చేరతాననేది ఇప్పుడే చెప్పను. సందర్భం వచ్చినప్పుడు చెబుతా. చేరేది పాత పార్టీయా, కొత్త పార్టీయా అనేది అప్పుడే చెబుతా. దైవసాక్షిగా చెబుతున్నాను. నేను ఏ పార్టీలో చేరితే దానికి ప్రచారం కోసం వెళ్తాను తప్ప మనసా, వాచా ఒక పదవి అలంకరించాలని లేదు. రాజకీయంగా నేను నెంబర్‌వన్ కావాలని కోరుకోవడం లేదు.

    English summary
    Mohan Babu says that Sr.NTR is his brother and CHiru is his Best Friend.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X