హరికృష్ణ కడసారి చూపుకు నోచుకోలేకపోయిన మోహన్ బాబు.. కారణం ఇదే!
నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సినీరాజకీయ ప్రముఖులు షాక్ కు గురయ్యారు. బుధవారం ఉదయం హరికృష్ణ నెల్లూరుకు ప్రయాణిస్తుండగా నల్గొండలో ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం హరికృష్ణ అంతిమ యాత్ర కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా హరికృష్ణ మరణ వార్త విని సినీనటుడు మోహన్ బాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. హరికృష్ణ, మోహన్ బాబు కలసి శ్రీరాములయ్య చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ జ్ఞాపకాలని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. హరికృష్ణ నిర్మించిన డ్రైవర్ రాముడు చిత్రంలో కూడా మోహన్ బాబు నటించారు. అప్పటినుంచే మా మధ్య బంధం ఏర్పడిందని మోహన్ బాబు తెలిపారు.

హరికృష్ణ తనకు తమ్ముడిలాంటివాడని అన్నారు. తాను ప్రస్తుతం అమెరికాలో ఉన్నందువలన హరికృష్ణ అంత్యక్రియలకు హాజరు కాలేకున్నానని మోహన్ బాబు సందేశం పంపారు. అమెరికాలో ఉండగానే హరికృష్ణ మరణించాడని తెలిసింది. నాశరీరం ఒక్కసారిగా కంపించిపోయింది. దిగ్బ్రాంతికి గురయ్యా అని అన్నారు.


Click it and Unblock the Notifications











