ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు: మోహన్ బాబు

By Srikanya

హైదరాబాద్ : '' నాకు తెలిసీ నేను ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు. వర్మ కూడా అంతే. నాకు కోపం ఎక్కువని.. ఆవేశం మెండు అని కొందరు అంటుంటారు. కానీ నేను చేసే పనుల్ని దగ్గర నుంచి చూసినవాళ్లు అభినందిస్తారు. ఎందుకంటే కారణం లేనిదే నేను ఏ విషయంలో ఆవేశం ప్రదర్శించను. వర్మ విషయంలోనూ ఇంతే. మేమిద్దరం వివాదాస్పద ప్రముఖులం అంటుంటారు. అయినా వివాదం లేనివాడు మనిషే కాడు.'రౌడీ'ని చూసి అందరూ ఇది మోహన్‌బాబు వన్‌మ్యాన్‌ షో అంటున్నారు. ఇది నా షో కాదు. మా చిత్రబృందం అందరి షో. అందరినీ ముందుండి నడిపించిన వర్మ షో'' అన్నారు మోహన్ బాబు. మోహన్‌బాబు - రామ్‌గోపాల్‌ వర్మ కలయికలో రూపొందిన 'రౌడీ' అనే సినిమా మొన్న శుక్రవారం విడుదలైంది. ఈ సందర్బంగా మోహన్ బాబు మాట్లాడుతూ ఇలా స్పందించారు.

అలాగే ...''రామ్‌గోపాల్‌వర్మ పనితనం చూసి, కొందరి ద్వారా తెలుసుకొని పదేళ్ల కిత్రమే ఒకసారి నాతో సినిమా చేయమని అడిగాను. కానీ కుదర్లేదు. ఈ విషయాన్ని నేనే మరచిపోతున్న రోజుల్లో ఒకసారి విష్ణు వచ్చి 'రామ్‌గోపాల్‌వర్మ నిన్ను కలవడానికి ఇంటికి వస్తున్నారు' అన్నాడు. అలా వర్మని కలిశాను. తర్వాత మూడు రోజుల్లోనే కథని సిద్ధం చేసి తెచ్చాడు. నచ్చి సరే అన్న రెండు రోజులకే మొత్తం నటీనటుల జాబితా, ఎలా, ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరణ జరపాలో ప్రణాళిక కూడా తెచ్చుకున్నాడు. అంత పక్కాగా ఉంటాడు వర్మ. సినిమాని ముందుగా అనుకున్నట్లే 30 రోజుల్లో పూర్తి చేశాడు. అనుకున్న బడ్జెట్‌లో రూ.56 లక్షలు మిగిలాయి. నేను గతంలోనూ అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీ చిత్రాల్ని 20-30 రోజుల్లోనే చేశాను. కానీ ఈ సినిమా ప్రత్యేకం'' అని చెప్పారు.

Mohan Babu about his latest Rowdy

ఇక ''ఈ సినిమా కథతో రామ్‌గోపాల్‌వర్మ వచ్చినప్పుడు నాకున్న ఆలోచన ఒక్కటే. నేనేంటో, నా నటనేంటో ఇప్పటికే అందరికీ తెలుసు. నేనేదో ఇప్పుడు కొత్తగా చూపించక్కర్లేదు. విష్ణుని పూర్తిస్థాయి యాక్షన్‌ హీరోగా చూడాలనుకున్నాను. అది వర్మ చేసి చూపించాడు. కుటుంబ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలకు మంచి స్పందన వస్తోంది. గంగోత్రి విశ్వనాథ్‌ రాసిన సంభాషణలకు స్పందన బాగుంది. ఈ సినిమాలో అన్న పాత్రకి నిజ జీవితంలో నాకూ పెద్ద తేడా ఉండదు. ఇద్దరం అన్యాయాన్ని సహించం. కుటుంబం కోసం, సమాజం కోసం ఎక్కువగా ఆలోచిస్తాం.'' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X