మనోజ్ యాక్టర్ అందుకే అయ్యాడేమో...మోహన్ బాబు
"నువ్వు పుట్టినప్పుడు నేను షూటింగ్‌లో ఉన్నా. మేకప్ లోనే నిన్ను చూడటానికి వచ్చా. అందుకే నువ్వు సహజంగానే యాక్టర్‌వి అయిపోయావు" అంటారు తన తండ్రి మోహన్ బాబు అంటూ చెప్పుకొచ్చాడు మంచు మనోజ్. అలాగే నాకు పదకొండు నెలలు ఉండగా- గృహలక్ష్మి సినిమాలో యాక్ట్ చేశా. చిన్నప్పటి నుంచి యాక్టర్‌నే కావాలనుకున్నా. ఇక చదువంటారా..పుస్తకం తీస్తే నిద్ర వచ్చేస్తుంది. ఒక్క అక్షరం బుర్రలోకి ఎక్కదు. చిన్నప్పుడు నా వర్క్ అంతా అక్క చేసి పెట్టేది. అందుకే నేను పుట్టినప్పటి నుంచి యాక్టర్‌నేమో అని చెప్పారు. మంచు మనోజ్ హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రం వేదం మంటి టాక్ తో ముందుకెళ్తోంది. అలాగే మనోజ్ హీరోగా కె.రాఘవేంద్రరావుగారి దర్సకత్వంలో చేసిన ఝుమ్మందినాదం చిత్రం త్వరలోనే రిలీజవబోతోంది.
మనోజ్ కుమార్ మోహన్ బాబు ఝుమ్మంది నాదం కె రాఘవేంద్రరావు manoj kumar mohan babu jhummandi naadam k raghavendra rao


Click it and Unblock the Notifications