»   » కలెక్షన్లు గ్యాసే, వాళ్ల పరిస్థితి కుక్కలు చింపిన విస్తరే: మోహన్ బాబు

కలెక్షన్లు గ్యాసే, వాళ్ల పరిస్థితి కుక్కలు చింపిన విస్తరే: మోహన్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాధారణ వ్యక్తిగా తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతి శిఖరాలను అధిరోహించి తెలుగువారికి అభిమాన నటుడయ్యారు. నటజీవితంలో నలభై వసంతాలను పూర్తి చేసుకుని ఈ తరం నటులకు ఆదర్శప్రాయంగా నిలిచారు.

నటుడిగా, నిర్మాత, విద్యావేత్తగా, రాజకీయవేత్తగా, అన్నింటికీ మించి మంచి మనసున్న వ్యక్తిగా ఇలా పలు రంగాల్లో తనదైన శైళిలో అద్భుతంగా రాణించి భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. అలాగే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుండి గౌరవ డాక్టరేటు అందుకున్నారు. ప్రస్తుతం కుమారులు విష్ణు, మనోజ్, కుమార్తె లక్ష్మీ ప్రసన్న మోహన్ బాబు అడుగు జాడల్లో నడుస్తూ సినీ రంగంలో రాణిస్తున్నారు.

మోహన్ బాబు సినీ రంగంలో నటుడిగా 40 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు పలు కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే మోహన్ బాబు 40 నట వసంతాల వేడుకను వైజాగ్ లో నేడు (సెప్టెంబర్ 17) కలకాలం గుర్తుండి పోయేలా భారీ సెట్ వేసి టి.సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు.

40 వసంతాల సంబరాల్లో భాగంగా ఆయన ఓ ప్రతికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ జీవితంలొని పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. దీంతో పాటు కొన్ని సంచలన కామెంట్స్ చేసారు.

 కుక్కలు చింపిన విస్తరి

కుక్కలు చింపిన విస్తరి

‘‘ఇప్పటి నిర్మాత పరిస్థితి బాగాలేదు. కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది. ఈ తప్పు కచ్చితంగా నిర్మాతదే. ఓ దర్శకుడు హిట్టు కొడితే అతని చుట్టూ తిరగడం మొదలెడుతున్నారు. రూ.50 లక్షలకు అర్హుడైతే రూ.మూడు కోట్లు ఇస్తున్నారు. దాంతో రూ.పది కోట్లతో సినిమా తీసేవాడు.. అరవై కోట్లు ఖర్చుపెడుతున్నాడు'' అని మోహన్ బాబు అన్నారు.

 కలెక్షన్లు గ్యాసే, బినామీల పేర్లమీదే

కలెక్షన్లు గ్యాసే, బినామీల పేర్లమీదే

"కోట్లు కోట్లు పెట్టి తీస్తున్న చాలా సినిమాలల్లో చాలా మంది నిరక్మాతలు బినామీల పేర్లు మీద సినిమాలు తీస్తున్నారు. అందుకే ఇండస్ట్రీలో డబ్బుకి విలువ లేకుండా పోయింది. మా సినిమాకి ఇన్ని కోట్లు వచ్చాయి, అన్ని కోట్లు వచ్చాయి అని చెప్పుకోవడం కూడా అంతా గ్యాసే. వాళ్లు చెబుతున్న అంకెలు వేరు... వాస్తవాలు వేరు'' అని మోహన్ బాబు సంచలన కామెంట్స్ చేసారు.

కలెక్షన్లు గ్యాసే, వాళ్ల పరిస్థితి కుక్కలు చింపిన విస్తరే: మోహన్ బాబు

కలెక్షన్లు గ్యాసే, వాళ్ల పరిస్థితి కుక్కలు చింపిన విస్తరే: మోహన్ బాబు

‘‘నిర్మాతగా యాభై పైచిలుకు చిత్రాలు చేశా. ఏ ఒక్కరికీ ఒక్క పైసా కూడా ఎగ్గొట్టలేదు. ‘ఇదిగో ఇంతే ఇస్తా... ఇంతే ఇవ్వగలను' అని చెప్పేవాడ్ని. ఇస్తానన్నది రూపాయి అయినా పువ్వుల్లో పెట్టి ఇచ్చేవాడ్ని. నిర్మాతగా విజయాలు వచ్చాయి... పరాజయాలు పలకరించాయి. అవన్నీ జీవితంలో అత్యంత సహజం' అని మోహన్ బాబు తెలిపారు.

 వృథా ఖర్చు నచ్చదు

వృథా ఖర్చు నచ్చదు

"వృథా ఖర్చులు నాకు నచ్చవు. పూల బొకేల కోసం, దండల కోసం నా అభిమానులు డబ్బు ఖర్చు పెడుతుంటే నాక్కూడా కష్టంగా ఉంటోంది. అందుకే వాళ్లందరికీ చెప్పేదొక్కటే. దండలు, బొకేలూ కొనే బదులు ఆ డబ్బుతో ఓ పేదవాడి కడుపైనా నింపండి. ఆ పుణ్యం మీకే కాదు.. నాక్కూడా దక్కుతుంది" అని మోహన్ బాబు తెలిపారు.

 నిజాయతీ నిండిన జీవితం కనిపించాలి

నిజాయతీ నిండిన జీవితం కనిపించాలి

మనం ఏం సాధించాం? అని వెనక్కి తిరిగి చూసుకొంటే నిజాయతీ నిండిన జీవితం కనిపించాలి. మోహన్‌బాబు ఎవ్వరినీ మోసం చేయలేదు... చేయబోడు. మరొకరు వేలెత్తి చూపించడానికి వీల్లేని జీవితం గడపాలనుకొన్నా. ఆ విషయంలో నేను నూటికి నూరుశాతం తృప్తిగా ఉన్నా అని మోహన్ బాబు అన్నారు.

 అలాంటి ఖర్మ నాకూ నా బిడ్డలకూ పట్టలేదు

అలాంటి ఖర్మ నాకూ నా బిడ్డలకూ పట్టలేదు

వీళ్లు పెద్ద దర్శకులు, వీళ్లు చిన్న దర్శకులు అనే ఆలోచన నాకెప్పుడూ రాదు. సత్తా ఉన్నవాడే నా దృష్టిలో పెద్ద దర్శకుడు. గడియారంలో ముళ్లు ఎప్పుడూ ఒకేచోట ఆగిపోవు. కాలం తిరుగుతూ ఉంటుంది. ఇప్పటి కొత్త వాళ్లే రేపటి స్టార్‌ డైరెక్టర్స్‌ అవ్వొచ్చు. నా బిడ్డలు అలాంటి దర్శకులతోనే పనిచేస్తున్నారు. ‘బాబ్బాబూ... మా వాడితో సినిమా తీయండి' అంటూ నేను ఏ దర్శకుడి వెంట పడను. వాళ్లకు వూడిగం చేయను. వాళ్ల ఇంటి చుట్టూ పదిసార్లు తిరగాల్సిన ఖర్మ నాకూ నా బిడ్డలకూ పట్టలేదు అని మోహన్ బాబు తెలిపారు.

English summary
MB40, one of the most speculated events in the Tollywood film circle, is scheduled for September 17th in Vizag. A huge set is being planned to host the event. The event is much in news and if sources are to be believed, will be an occasion to remember for a long time. Among the many celebrations, MB40 will have three categorically significant programs. To begin with, the event will see the launch of an audio CD that will comprise of 60 of the most celebrated songs from Mohan Babu’s 40 years run in the South Indian film industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu