నేను కోరుకున్నట్లే కేసీఆర్ గెలిచారు: మోహన్ బాబు
తాను కోరుకున్నట్లే తెలంగాణలో కేసీఆర్ గెలిచారని, టీఆర్ఎస్ పార్టీకి అఖండ విజయం దక్కిందంటూ సంతోషం వ్యక్తం చేశారు ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా తన మనసులోని మాట బయట పెట్టారు.
''ఎన్నికలకు ముందు ఫిలిం నగర్ దైవసన్నిధానం ప్రాగణంలో కేసిఆర్ గారు గెలవాలని కోరు కుంటున్నాను అన్నాను. తధాస్తు దేవతలు తధాస్తు అన్నారు. ప్రజలు అద్భుతమైన అనితరసాధ్యమైన విజయాన్ని అందించారు. కేసిఆర్ గారూ సంభవం ఇది మీకే సంభవం! మీ విజయ పరంపర ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేశారు.

ఒక పార్టీ... అన్ని పార్టీలతో ఎంతో అందంగా ఫైట్ చేసింది. రాష్ట్రంలో అనేక అంశాలలో ఒక అందమైన మార్పును తీసుకొచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది. వారికి నా అభినందనలు... అంటూ మోమన్ బాబు కూతురు మంచు లక్ష్మి ట్వీట్ చేశారు.
మరో వైపు మంచే మనోజ్ కూడా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











