మోహన్ యాక్షన్-చిరంజీవి రియాక్షన్
మోహన్ బాబు డైలాగులో ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో తాను నటించిన అసెంబ్లీరౌడీ సినిమా చూసి తెలుసుకోవాలని సహనటుడు. చిరంజీవికి మోహన్ బాబు ఉచిత సలహా ఇచ్చారు. తాను ఎరినైనా అనాలనుకుంటే నిర్మొహమాటంగా చెప్పుతానన్నారు. మరొక విధంగా మాట్లాడే నైజం తనకు లేదని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న వరద పరిస్థితిని తమ సొంత ఇంటి విపత్తుగా భావించినా ఈ సమావేశానికి హాజరుకాని వారి క్షమించరాదని చెప్పానని శ్రీ విధ్యానికేతన్ లో విలేకరుల సమావేశంలో తెలియజేశారు. దానికి రియాక్షన్ గా చిరంజీవి మూవీ ఆర్టిస్టు అసోసిమే సమావేశానికి రాకపోతే ఏ పరిస్థితుల్లో రాలేకపోయారో అనుకోవాలి తప్ప, రాకపోవడాన్ని పెద్ద తప్పుగా చేసి మాట్లాడడం పద్దతి కాదని ప్రజారాజ్యం పార్టీ అధినేత, మెగాస్టార్ చిరంజీవి ఆక్షేపణ వ్యక్తం చేశారు.
'మా" సమావేశానికి చిరంజీవి కుటుంబం వెళ్లకపోవడంపై మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలను మీడియా సమావేశంలో చిరంజీవి దష్టికి తీసుకెళ్లగా ఆయన డైలాగులు బాగానే వళ్ళిస్తారు. ఆ సమయంలో మైకుదొరికే సరికి అలా మాట్లాడి ఉంటారన్నారు. ఈ సమావేశానికి చిరంజీవి ఫ్యామిలీ కూడా వస్తే బావుంటుందని నటుడు రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలప స్పందిస్తూ ఆశాభావం వ్యక్తం చేయడం ఏమిటి? చిత్రపరిశ్రమతో నా అనుబంధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అసలు నా హార్ట్ అక్కడే ఉందన్నారు. సమావేశానికి వెళ్లకపోతే సహాయ నిరాకరణ చేస్తున్నారని పెద్ద మాటలు అనడం సరికాడు అని చిరంజీవి లేవదన వ్యక్తం చేశారు.
ఒక రకంగా చెప్పాలంటే వరద బాధితులకు సహాయం చేయడంలో తన కుటుంబమే ముందుందని తన తనయుడు రామ్ చరణ్, అల్లుడు అల్లు అర్జున్ తమ వంతు విరాళాలు అందించారన్నారు. అలాగే తన వంతు వరదలు వచ్చిన దగ్గరి నుంచి ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ మారుమూల ప్రాంతాలకు తిరిగి బాధితులను కలుసుకోవడం, సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించడం జరుగుతోందన్నారు. భవిష్యత్తులో మా" తీసుకొనే ఏ కార్యక్రమంలోనైనా మా భాగస్వామ్యం ఉంటుందని తెలియజేశారు.


Click it and Unblock the Notifications











