మోహన్ బాబు నట ప్రస్ధానం మరోసారి మొదలై మంచి ఊపు మీద ముందుకెళుతోంది. ప్రస్తుతం బుజ్జిగాడు మేడిన్ చెన్నై లో త్రిష అన్నగా కీలకమైన పాత్రను చేస్తున్న ఆయన తాజాగా ఆర్.కె.అసోసియేట్ పతాకంపై కె.రాఘవేంద్రరావు నిర్మించి, దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పాండురంగడు' లో కనిపించబోతున్నారట. చాలా కాలం తర్వాత బాలకృష్ణ రెండు పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు మునీశ్వరుడుగా ఒక అద్వితీయమైన, కీలకమైన పాత్రను పోషిస్తున్నారట. రాఘవేంద్రరావు గత చిత్రం అన్నమయ్య లోనూ ప్రత్యేక పాత్రలో కనిపించి మోహన్ బాబు అదరకొట్టారు. దాంతో ఈ పాత్ర కూడా సినిమాకు ఎస్సెట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే కీరవాణి స్వరాలు కూర్చిన ఆడియో తెలుగు వారిని బాగా ఆకట్టుకుంటోంది. అన్నమయ్య రేంజిలో పాటలు ఉన్నాయని అంతటా ప్రశంసలు కురుస్తున్నాయి. అలాగే 'యమదొంగ' చిత్రంలో అబ్బాయ్ యన్టిఆర్ తో నటించిన మోహన్ బాబు ఇప్పుడు బాబాయ్ బాలకృష్ణ సినిమాలో కనిపించబోవటం అభిమానులను ఆనందపరుస్తోంది.