వారందరికీ మందు పార్టీలు ఇవ్వాలా?.. నేను భయపడేది ఆ ఒక్కరికే.. మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్‌లో మోహన్ బాబు అంటే అందరికీ టెర్రర్. ఆయన క్రమశిక్షణ, సమయపాలన అంటే అందరికీ హడలే. ఈ విషయం ఇండస్ట్రీ మొత్తానికి తెలుసే. ఆయనకు ఎదురుగా నిలబడాలంటే అందరికీ వెన్నులో వణుకు పుడుతంది. కానీ ఆయన్ను కూడా భయపెట్టే ఓ మనిషి ఉన్నారంటా.. ఈ విషయాన్ని మోహన్ బాబే స్వయంగా చెప్పాడు. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ బాబు ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

యువ దర్శకులు భయపడుతున్నారు..
మీ టాలంట్‌ను ఉపయోగించుకోలేక పోతున్నారు.. మీరంటే ఉన్న భయం వల్లే యువ దర్శకులు మీ దగ్గరకు రాలేకపోతున్నారు.. అంటే తనదైన శైలిలో స్పందించాడు. అంటే వారందరికి మందు పార్టీ ఇవ్వాలా లేదంటే ముంబయి ఢిల్లీ తీసుకు వెళ్లి వారికి పార్టీలు ఇవ్వనా అంటూ ప్రశ్నించాడు. వారు ఎందుకు భయపడుతున్నారో వారినే అడగాలని కూడా మోహన్ బాబు చెప్పుకొచ్చాడు.

దాసరి కూడా భయపడతాడట..
గురువు గారు అని ప్రేమగా సంభోదించే దాసరి కూడా మోహన్ బాబుకు భయపడతాడట కదా అని ప్రశ్నిస్తే.. ఆయన ఎవరికీ భయపడడు.. అయితే తాను చూపించే ప్రేమకు భయపడతాడేమోనని అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన లేనప్పుడు ఇలాంటివి మాట్లాడకూడదు.. ఒకవేళ ఆయన ఉండి ఉంటే.. ఇంకా చాలా విషయాలు చెప్పేవాడిని అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు.

నేను భయపడేది ఆ ఒక్కరికే..
ఇక అందరు మోహన్ బాబు అంటే భయపడితే ఆయన మాత్రం తన కూతురు లక్ష్మి మంచుకు భయపడతాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పుకొచ్చాడు. కేవలం ఆమె అంటేనే నాకు భయం. అన్ని విషయాల్లోను ఆమెంటే నాకు భయం. రాక్షసిలాగా ప్రవర్తిస్తుంది. ప్రతి చిన్న విషయానికి కూడా నన్ను కసురుకుంటుంది. ప్రతి విషయానికి అలుగుతుంది. నా కోపమే ఆమెకు వచ్చింది. ఇంక ఎవరికి భయపడను కాని ఆమెకు అంత భయపడతాను. ఎంత భయపడతానో అంతగా ప్రేమిస్తానంటూ కూతురుపై ఉన్న ఆప్యాయతను చెప్పుకొచ్చాడు.

రజనీకాంత్‌ను వాడు వీడు అనడంపై...
ఓ వేదికపై రజనీకాంత్‌ను ఉద్దేశించి మోహన్ బాబు కాస్త ఘాటు వ్యాఖ్యలే చేశాడు.వారికున్న స్నేహం కొద్దీ సూపర్ స్టార్‌ను పట్టుకుని వాడు వీడు అని సంభోదించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని మోహన్ బాబు వద్ద ప్రస్థావిస్తే.. అది మా మధ్య ఉండే చనువు.. అతనికి నాకు లేని బాధ మధ్యలో వారికెందుకు అంటూ రజినీతో ఉన్న స్నేహం గురించి చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











