»   »  ‘మామ మంచు అల్లుడు కంచు’ టైటిల్ కేక..

‘మామ మంచు అల్లుడు కంచు’ టైటిల్ కేక..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు, అల్లరి నరేష్ కాంబినేషన్ లో మంచు విష్ణు నిర్మాతగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘మామ మంచు అల్లుడు కంచు' అనే టైటిల్ ఖరారు చేసారు. మోహన్ బాబు మంచు విష్ణు టైటిల్ రోల్స్ చేస్తున్నారు.

Mohan Babu – Allari Naresh movie title

మంచు మోహన్ బాబు, అల్లరి నరేష్ ల కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ భారీచిత్రాన్ని మంచు విష్ణు తన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించనున్నారు. బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్', ‘ఢమరుకం' వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా త్వరలోనే సెట్స్ లోకి వెళ్లనుంది.

డా. మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా కాంబినేషన్ అనగానే గుర్తొచ్చే చిత్రం ‘అల్లరి మొగుడు'. వెండితెరపై ఈ కాంబినేషన్ చేసిన మేజిక్ ని అంత సులువుగా మర్చిపోలేం. మోహన్ బాబు చిత్రాల్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన వాటిలో ‘అల్లరి మొగుడు'కి ప్రముఖ స్థానమే ఉంటుంది. సిల్వర్ జూబ్లి సాధించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు గుర్తు చేయడానికి కారణం ఉంది. మరోసారి మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా కాంబినేషన్ వెండితెరపైకి రానుంది. 23 ఏళ్ల తర్వాత ఈ త్రయం మళ్లీ మేజిక్ చేయబోతున్నారు.

ఈసారి ఈ కాంబినేషన్ కి ‘అల్లరి' నరేష్ తోడయ్యారు. నరేష్ సరసన పూర్ణ కథానాయికగా నటించనున్నారు. ఈ చిత్రానికి అచ్చు, బప్పా లహరి, రఘు కుంచె పాటలు స్వరపరుస్తున్నారు. ఇప్పటికే రెండు పాటల రికార్డింగ్ పూర్తయ్యింది. అలీ, రఘుబాబు, రాజా రవీంద్ర, కృష్ణభగవాన్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సిపాన, కెమెరాః బాల మురుగన్, ఆర్ట్ః చిన్నా, దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి, నిర్మాత: మంచు విష్ణు.

English summary
Allari Naresh - Mohan Babu combination film in Srinivas Reddy direction. As per the latest update, the makers have announced ‘Maama Manchu Alludu Kanchu’ as its title.
Please Wait while comments are loading...