మళ్ళీ సోలో గా వస్తానంటున్నా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు..!?
పొలిటికల్ రౌడీ చిత్రం తర్వాత హీరో వేషాలు పక్కన పెట్టి ప్రాముఖ్యత వున్న పాత్రల్లో నటిస్తున్న హీరో మోహన్ బాబు.. త్వరలో ఓ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు రెగ్యులర్ గా జరుగుతున్నాయి. చాలా కాలంగా మళ్లీ సోలోగా మొదలు పెట్టాలని ప్రయత్నిస్తున్న మోహన్ బాబు తర్వలో 'వివేకానంద"గా రాబోతున్న విషయం తెలిసిందే..బివిఎస్ రవి, కోనవెంకట్, రాధామోహన్ కథ అందిస్తున్న ఈ సినిమలో మోహన్ బాబు ఏకంగా ఐదుగురు ముద్దుగుమ్మలతో కలిసి నటించబోతున్నాడని ఫిలింనగర్ సమాచారం..
లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్ బాబు నిర్మించే ఈ సినిమాకి దర్శకుడు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా వుంది. నేటి సమకాళీన రాజకీయాల నేపద్యంలో రూపొందనున్న ఈ చిత్రం గతంలో మోహన్ బాబు నటించిన 'అసెంబ్లీరౌడీ" చిత్రాన్ని తలపించే విధంగా వుంటుందని ప్రస్తుతం ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తోంది..


Click it and Unblock the Notifications











