For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మోహన్‌బాబుతో చిరంజీవి సీక్రెట్ టూర్: ఆమె చేసిన పనికి బయటకొచ్చిన మేటర్.. అసూయ పడుతూ ఇలా!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి దాదాపు ఒకే సమయంలో ఎంట్రీ ఇచ్చారా ఇద్దరు. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ తమ సత్తాను నిరూపించుకున్నారు. తద్వారా చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోలుగా ఎదిగిపోయారు. వాళ్లే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. మెగాస్టార్ చిరంజీవి. దాదాపు నాలుగు దశాబ్ధాలుగా టాలీవుడ్‌ను హవాను చూపిస్తోన్న ఈ ఇద్దరు స్టార్లు ఎప్పుడు కలిసినా సంచలనం అవుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా వీళ్లిద్దరూ కలిసి సీక్రెట్ టూర్ వెళ్లారు. మంచు లక్ష్మీ చేసిన పని వల్ల మేటర్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

  షర్ట్ బటన్స్ తీసేసి కాక రేపుతోన్న శివానీ నారాయణన్ ఫొటోలు

  ఇద్దరూ విలన్లుగానే.. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్

  ఇద్దరూ విలన్లుగానే.. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్


  అటు మోహన్ బాబు.. ఇటు చిరంజీవి ఇద్దరూ విలన్ పాత్రలు పోషించడం ద్వారానే తెలుగు వాళ్లకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత హీరోలుగా మారిపోయారు. అప్పటి నుంచి విభిన్నమైన శైలితో సినిమాలు చేస్తూ వచ్చారీ ఇద్దరు. సుదీర్ఘమైన ప్రయాణంలో మెగాస్టార్ 150కి పైగా చిత్రాల్లో నటించగా.. మోహన్ బాబు ఏకంగా 500 కంటే ఎక్కువ సినిమాల్లోనే నటించి మెప్పించడం విశేషం.

  చీరకట్టులో వయ్యారాలు ఒలకబోస్తున్న పార్వతీ నాయర్ ఫొటోలు

  ఈ ఇద్దరి మధ్యా కోల్డ్ వార్.. పుకార్లు షికార్లు

  ఈ ఇద్దరి మధ్యా కోల్డ్ వార్.. పుకార్లు షికార్లు

  స్టార్ హీరోలుగా వెలుగొందుతోన్న సమయంలోనే మోహన్ బాబు.. చిరంజీవి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న టాక్ బాగా వినిపించేది. అంతేకాదు, వీళ్ల వల్ల ఇండస్ట్రీ కూడా రెండు వర్గాలుగా విడిపోయిందన్న ప్రచారమూ జరిగింది. అదే సమయంలో ఈ సీనియర్ హీరోలు ఇద్దరూ మాట్లాడుకోకపోవడం.. కలవకపోవడం.. ఎప్పుడూ ఎడమొఖంగా ఉండడంతో ఆ పుకార్లు వచ్చాయి.

  ఒక్కటైన స్నేహితులు.. అండగా నిలుస్తూనే

  ఒక్కటైన స్నేహితులు.. అండగా నిలుస్తూనే

  చాలా కాలంగా దూరంగా ఉంటూ వచ్చిన చిరంజీవి, మోహన్ బాబు.. కొద్ది రోజుల క్రితం ఒక్కటయ్యారు. తద్వారా తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని చాటి చెప్పారు. అదే సమయంలో పెద్ద పెద్ద దర్శక నిర్మాతలు కాలం చేసిన తర్వాత వీళ్లిద్దరే సినీ పరిశ్రమకు అండగా నిలుస్తున్నారు. పెద్దరికం చేస్తూనే కరోనా లాక్‌డౌన్ వంటి క్లిష్ట సమయాల్లో కార్మికులకు సాయం చేస్తున్నారు.

  మోహన్ బాబుతో కలిసి చిరంజీవి సీక్రెట్ టూర్

  మోహన్ బాబుతో కలిసి చిరంజీవి సీక్రెట్ టూర్

  కొంత కాలంగా మెగాస్టార్ చిరంజీవి.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మధ్య సత్సంబంధాలు మరింతగా పెరిగాయి. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ తరచూ కలుస్తున్నారు. ఒకరి సినిమాలకు మరొకరు ప్రమోషన్ కూడా చేస్తున్నారు. ఒకరినొకరు గౌరవించుకోవడం.. పొగుడుకోవడం వంటివి చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి సమయంలోనే వీళ్లిద్దరూ తాజాగా ఓ సీక్రెట్ టూర్ వెళ్లారు.

  ఆమె చేసిన పనితో బయటకు వచ్చిన మేటర్

  ఆమె చేసిన పనితో బయటకు వచ్చిన మేటర్

  మంచు లక్ష్మీ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో మోహన్ బాబు - చిరంజీవి కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. ‘వీళ్లిద్దరూ సిక్కిం టూర్‌కు వెళ్లారు. ఇద్దరు మాస్ట్రోలు ఒకేచోట కలిస్తే ఫైరే. ఈ వీకెండ్ టూర్‌ కోసం నాన్నను ఒప్పించిన ఘనత మీకే దక్కింది చిరు అంకుల్. మీరు కలిసి ఎంజాయ్ చేసినందుకు నాకు అసూయగా ఉంది. త్వరలోనే అందరం కలిసి వెళ్దాం' అంటూ రాసుకొచ్చింది.

  ఆచార్యగా చిరు.. సన్ ఆఫ్ ఇండియాగా బాబు

  ఆచార్యగా చిరు.. సన్ ఆఫ్ ఇండియాగా బాబు


  ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య' అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. మరోవైపు.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇప్పుడు ‘సన్ ఆఫ్ ఇండియా'లో చేస్తున్నారు. డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మేస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూర్చుతున్నారు.

  English summary
  When two maestros go for a quick trip to Sikkim, you know it’s going to be Only KChiruTweets uncle you could have convinced Nana for a quick weekend trip to Sikkim! I’m so jealous! So good to see you both having a nice time. Heart is full! Let us kids accompany you someday.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X