వీర తెలంగాణ పేరుతో ఆర్.నారాయణ మూర్తి రూపొందించనున్న చిత్రంలో మోహన్ బాబు, శ్రీహరి నటించనున్నారని సమాచారం. రజాకార్ల ఉద్యమం ప్రేరణతో తయారైన ఈ స్క్రిప్టు విన్న వీరిద్దరూ వెంటనే ఓకే చేసారని తెలుస్తోంది. జూన్ నెలాఖరులో ప్రారంభమయ్యే ఈ చిత్రం వాస్తవిక సంఘటనలకు అద్దం పట్టనుందని సమాచారం. ఇక వీరిద్దరూ తెలంగాణా యోధులుగా కనిపించనున్నారని చెప్పుతున్నారు. అలాగే కూతరు కోసం చిత్రంతో ఆర్దికంగా దెబ్బ తిన్న నారాయణ మూర్తి ఈ చిత్రాన్ని ఓ ప్రెజ్టేజియస్ ప్రాజెక్టుగా భావించి చేస్తున్నారు. నారాయణ మార్తి ఓ కీలకమైన పాత్రలో చిత్రం అంతటా కనిపిస్తారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంభందించిన పాటలు కోసం ప్రజా గాయకులను రచయితలును సంప్రదిస్తున్నారు.