సునీల్ శెట్టి అలా మంచు విష్ణు ఇలా.. మధ్యలో మోహన్ బాబు ఫైర్.. ఏది నిజం!

మోసగాళ్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా జరిగిందో అందరికీ తెలిసిందే. ఒకరిపై ఒకరు పంచ్‌లు వేసుకుంటూ రచ్చ రచ్చ చేశారు. మరీ ముఖ్యంగా రానా మీద మోహన్ బాబు వేసిన సెటైర్లు, మంచు విష్ణు సునీల్ శెట్టి మోహన్ బాబు మధ్య జరిగిన సంభాషణ అన్నీ కూడా బాగానే వైరల్ అవుతున్నాయి. వయసు గురించి వచ్చిన చర్చలో మోహన్ బాబు కాస్త అసహనం వ్యక్తం చేసినట్టు కనిపించింది.

మంచు విష్ణు అలా..

మంచు విష్ణు అలా..

మోసగాళ్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. సునీల్ శెట్టి ఫిట్ నెస్ గురించి, యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయనతో పోటీ పడిన విధానాన్ని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఓ యాక్షన్ సీక్వెన్స్ గురించి చెబుతూ మోహన్ బాబు వయసు మీద సునీల్ శెట్టి కామెంట్ చేసినట్టుగా మంచు విష్ణు తెలిపాడు.

అలా అన్నాడట..

అలా అన్నాడట..

ఓ యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ.. నా వయసు 58 అయినా నేను ఇలా చేస్తున్నాను.. నువ్ చేయగలవా? మీ నాన్న చేయగలరా? అని అన్నాడట. అయితే ఇలా మంచు విష్ణు మాట్లాడుతూ ఉండగానే మధ్యలో మోహన్ బాబు ఎంటరయ్యాడు.

 సునీల్ శెట్టితో అలా..

సునీల్ శెట్టితో అలా..

మంచు విష్ణు అలా చెప్పడంతోనే మోహన్ బాబు మైక్ అందుకుని.. అలా ఎలా అంటారు అని సునీల్ శెట్టిని సున్నితంగా మందలించాడు. మీరు నా వయసు గురించి మాట్లాడుతూ.. నేను యాక్షన్ సీక్వెన్స్ చేయలేనని అంటారు.. ఇప్పుడు కూడా యాభై ఫీట్ల గోడ మీద నుంచి దూకగలను అంటూ చెప్పుకొచ్చాడు.

మంచు విష్ణు అబద్దం చెప్పాడు..

మంచు విష్ణు అబద్దం చెప్పాడు..

అయితే అలా మోహన్ బాబు అంటుండగానే సునీల్ శెట్టి అందుకున్నాడు. లేదు సర్ విష్ణు అబద్దం ఆడుతున్నారు. మీరు చేయలేరు.. మీ నాన్న చేయగలడా? అని అన్నాను అంటూ సునీల్ శెట్టి క్లారిటీ ఇచ్చాడు. దీంతో విష్ణు కూడా సైలెంట్ అయిపోయి టాపిక్ మార్చేశాడు. మొత్తానికి ఏది నిజమన్నది వారిద్దరికే తెలియాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X