For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలయ్యను కలిశాక మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు: లోకేష్‌ను ఓడించాలనుకున్నా.. ఎన్టీఆర్ పంపడం వల్లేనంటూ!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోని నటీనటులు, కార్మికులు బాగు కోసం ఏర్పాటైన సంఘమే 'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్'. దీనికి ప్రతి రెండేళ్లుకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ సారి గతంలో కంటే కాస్త ఎక్కువగానే హోరాహోరీగా సాగాయి. ఎన్నో మలుపులు, ఎన్నో గొడవలు, ఎన్నో ఊహించని పరిణామాల మధ్య గత ఆదివారం జరిగిన ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో అతడు బుధవారమే మా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు. ఇక, తాజాగా విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి నందమూరి బాలకృష్ణతో సమావేశం అయ్యాడు. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

  హోరాహోరీగా తలపడ్డ ప్రముఖులు

  హోరాహోరీగా తలపడ్డ ప్రముఖులు

  గతంలో కంటే 'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌'కు తాజాగా జరిగిన ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. ప్రకాశ్ రాజ్ వర్గం ఒకవైపు, మంచు విష్ణు ప్యానెల్ మరోవైపు ఇందులో పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే సినీ ప్రముఖులంతా రాజకీయ నేతల్లా పావులు కదుపుతూ.. విమర్శలు చేసుకోవడం సహా ఎన్నో విధాలుగా ఎన్నికలను రక్తి కట్టించారు. దీంతో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ సాగింది.

  హాట్ డ్రెస్‌లో మంచు లక్ష్మీ అందాల ఆరబోత: ఎద భాగం మొత్తం కనిపించేలా.. మరీ ఇంత దారుణమా!

  మా ఎన్నికల్లో మంచు విష్ణు విజయం

  మా ఎన్నికల్లో మంచు విష్ణు విజయం

  ఎన్నో మలుపులతో సాగిన 'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌' ఎన్నికలో ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అలాగే, అతడి ప్యానెల్‌లోని పలువురు సభ్యులు కూడా గెలుపొందారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి పలువురు ఈసీ మెంబర్లుగా గెలిచారు. ఇది జరిగిన తర్వాతి రోజే ప్రకాశ్ ప్యానెల్ సభ్యులు రాజీనామాలు చేసి షాకిచ్చారు.

   బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు

  బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు

  గత ఆదివారం జరిగిన 'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌' ఎన్నికలో విజయం సాధించిన మంచు విష్ణు.. బుధవారం 'మా' అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు. ఈ మేరకు హైదరాబాద్‌లోని కార్యాలయంలో అతడు తన చైర్‌లో కూర్చున్నాడు. అంతేకాదు, అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సినీ నటుల పెన్షన్ల ఫైలుపై తన తొలి సంతకాన్ని చేశాడు మంచు విష్ణు.

  హాట్ షో రెచ్చిపోయిన మోనాల్ గజ్జర్: గతంలో ఎన్నడూ చూడనంత ఘాటుగా.. ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

  తండ్రితో పాటు బాలయ్యను కలిశాడు

  తండ్రితో పాటు బాలయ్యను కలిశాడు

  'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌' ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత.. తనకు ఓటు వేసిన పెద్దలందరినీ కలుస్తానని మంచు విష్ణు చెప్పాడు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను స్వయంగా కలిసి ధన్యవాదాలు తెలిపాడు. ఈ క్రమంలోనే తాజాగా నటసింహా నందమూరి బాలకృష్ణను కలిశాడు. ఈ మీటింగ్‌లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఉన్నారు.

  బాలకృష్ణపై మోహన్ బాబు కామెంట్స్

  బాలకృష్ణపై మోహన్ బాబు కామెంట్స్

  నందమూరి బాలకృష్ణను కలిసి తర్వాత మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. 'విష్ణు బాబు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని చెప్పగానే బాలయ్య మద్దతు ప్రకటించాడు. ఓట్ కోసం ఫోన్ చేయగా.. మీరు నాకు చెప్పాలా అంటూ తనదైన శైలిలో మాట్లాడాడు' అంటూ చెప్పుకొచ్చాడాయన.

  బీచ్‌లో లవర్‌తో పాయల్ రాజ్‌పుత్ రచ్చ: బికినీలో అందాలన్నీ చూపిస్తూ.. షాకిస్తోన్న సెల్ఫీ వీడియో

  లోకేష్‌ పేరును వాడుతూ ప్రశంసలు

  లోకేష్‌ పేరును వాడుతూ ప్రశంసలు

  మీడియాతో మాట్లాడుతోన్న సమయంలో మోహన్ బాబు ఏపీ పాలిటిక్స్‌ను కూడా ప్రస్తావించారు. 'బాలకృష్ణ ఎంతో సంస్కారం ఉన్న వ్యక్తి. గత ఎన్నికల సమయంలో మంగళగిరిలో బాలయ్య అల్లుడు లోకేశ్‌‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశా. కానీ ఆయన అవేమీ మనసులో పెట్టుకోకుండా విష్ణుకు మద్దతు ప్రకటించాడు. అది ఆయన సంస్కారం' అంటూ ప్రశంసలు గుప్పించారు.

  MAA Elections: జ‌య‌ల‌లిత త‌మిళ‌నాడులో CM అవ్వలేదా.. క‌ళ‌కు ప్రాంత‌మేంటి ? Jeevitha
  ఎన్టీఆర్ పంపించడం వల్లే వచ్చాడు

  ఎన్టీఆర్ పంపించడం వల్లే వచ్చాడు

  సీనియర్ ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. 'అన్నయ్య నందమూరి తారక రామారావు గారి బిడ్డగా ఎంతో సంస్కారంతో వ్యవహరించాడు బాలయ్య. అక్కడ నా తమ్ముడి కొడుకు పోటీ చేస్తున్నాడు వెళ్లు అని స్వయంగా అన్నయ్యే బాలయ్యను విష్ణు దగ్గరకు పంపించారేమో అనిపిస్తుంది. ఆయన ఆశీర్వాదం కూడా ఉంది' అని వివరించారు మోహన్ బాబు.

  English summary
  Tollywood Actor and Producer Vishnu Manchu Won MAA Elections 2021 Recently. Now He Met Nandamuri Balakrishna with Mohan Babu
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X