బాలయ్య ప్యాన్స్ పై మండిపడ్డ మోహన్ బాబు

By Srikanya

బాలకృష్ణ ఫ్యాన్స్ పై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కోప్పడటం అంతటా చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' చిత్రం ఆడియో పంక్షన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. బాలకృష్ణ, మనోజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రమది. శేఖర్ రాజా దర్శకుడు. మంచు లక్ష్మి నిర్మాత. మంచు మోహన్‌బాబు సమర్పిస్తున్నారు.

'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' ఆడియో పంక్షన్ ఎరేంజ్ మెంట్స్ చూస్తూ మోహన్ బాబు బిజీగా ఉన్నారు. ఈ లోగా బాలకృష్ణ ఫ్యాన్స్ గట్టిగా జై బాలయ్య..జై జై బాలయ్య అంటూ నినాదాలు చేసారు. మోహన్ బాబు వెంటనే మైక్ తీసుకుని వారిని సైలెంట్ గా ఉండమని కోరారు. అయితే వీరాభిమానులు ఆయన మాటలు వినలేదు. దాంతో మోహన్ బాబు కి ఆ అబిమానులపై కోపం వచ్చింది. ఆయన వారిని ఉద్దేశించి...వారు సైలెంట్ గా ఉండకపోతే ఆడిటోరియం నుంచి బయిటకు పంపుతామని సీరియస్ గా చెప్పారు.

ఆ తర్వాత బాలకృష్ణ వెన్యూకు రావటం జరిగింది. మళ్లీ అభిమానలంతా ఒక్కసారిగా జై బాలయ్య..జై జై బాలయ్య అని నినాదాలు చేసారు. మోహన్ బాబు ఈ సారి ఏమీ అనలేదు. ఆ తర్వాత బాలకృష్ణ మైక్ తీసుకుని మాట్లాడటంతో ఆ ఫ్యాన్స్ అంతా ఆనందించారు.

బాలకృష్ణ మాట్లాడుతూ "ఇలాంటి పాత్రలు వచ్చినప్పుడు ఇమేజ్ అడ్డు తగిలినా ధైర్యం చేసి ముందుకెళ్ళాలి. ఈ సినిమా ఎవరి ఊహలకు అందదు. ఓ బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ తప్ప నాకు డ్యూయెట్లుండవు. సినిమా చేసేటప్పుడు నేను దాదాపు ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తాను. అది ఆ పాత్రకు నేనిచ్చే గౌరవంగా భావిస్తాను. మనోజ్‌ని చూస్తే గర్వంగా ఉంది. దర్శకుడు చక్కగా తెరకెక్కించారు. లక్ష్మిని మంచి నిర్మాతగా నిలబెడుతుంది'' అని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X