3డి రావణుడుగా మోహన్ బాబు

By Srikanya

త్వరలో త్రీడి రావణాసురుడు గా మోహన్ బాబు కనిపించి మురపించనున్నారు.ఈ విషయాన్ని మోహన్ బాబు స్వయంగా మీడియాకు తెలుపుతూ...రావణుడి ఔన్నత్యాన్ని చెప్పే సినిమా ఇది. ఇంతకుముందు ఎన్టీఆర్‌, ఎస్వీ రంగారావులాంటి మహా నటులు ఈ పాత్రలో కనిపించారు. వారి స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా నా శైలిలో రక్తి కట్టించేందుకు ప్రయత్నిస్తాను. భారత చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటిస్తారు. అధునాతన త్రీడీ పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తామని అన్నారు.

వచ్చే సంవత్సరం షూటింగ్ మొదలయ్యే ఈ చిత్రం గురించి దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ తరవాత సంభాషణలు ఆ స్థాయిలో పలికే నటుడు మోహన్‌బాబు. మా ఇద్దరి కలయికలో మంచి చిత్రాలొచ్చాయి. 'రావణ' కూడా అదే స్థాయిలో ఉంటుంది. పూర్తి వివరాలు త్వరలోనే చెబుతామని అన్నారు.మైధలాజికల్ ధ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని రాఘవేంద్రరావు ప్లాన్ చేస్తున్నారు.ఇక ప్రస్తుతం రాఘవేంద్రరావు,నాగార్జున కాంబినేషన్ లో షిర్డీ సాయిబాబా జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందుతోంది.అలాగే మోహన్ బాబు తన సొంత బ్యానర్ పై రాయుడుగారికి కోపమొచ్చింది అనే చిత్రం ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X