twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కామిడి విలన్ ‘మోహన్ బాబు’!

    By Sindhu
    |

    ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే తత్త్వం అంటూ సినీ ఇండస్ట్రీలో ఎవరున్నారంటే పధ్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు గుర్తుకు వస్తారు. తన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్న విలక్షణ నటుడు మోహన్ బాబు. తన గురువుగారంటూ.. చెప్పుకునే దాసరి నారాయణరావు ఆయనను సినీరంగానికి పరిచయం చేశారు. అసిస్టెంట్ దర్శకుడిగా, కో డైరెక్టర్‌గా పలు చిత్రాలకు పనిచేసిన ఆయన దాసరి వద్ద దర్శకశాఖకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. దాసరి కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ స్వర్గం- నరకంలో మోహన్ బాబుకు నటుడిగా ఛాన్స్ ఇచ్చాడు. సరిగ్గా ఆ చిత్రం విడుదలైఇప్పటికి 35 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా ఆయన తన సన్నిహితులైన మీడియా అధినేతలతో ముచ్చటించారు. సినిమారంగంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశానన్నారు. ఆత్మీయుడు రజనీకాంత్ గురించి ప్రస్తావిస్తూ...అటువంటి మానవతావాదిని మరే ఆర్టిస్టులోనూ చూడలేదన్నారు. అప్పట్లో సినిమా రంగంలో హీరోగా ఎదగాలంటే చాలా కష్టపడాల్సి వచ్చిందంటూ..ఇప్పుడు అంతా బ్రాండ్‌లా మారిపోయి, కొడుకులు వస్తున్నారంటూ, తన కుమారులు గురించి కూడా ప్రస్తావించారు.

    ప్రేక్షక దేవుళ్ల ఆశీస్సులుంటే వారు ఈ రంగంలో ఎదుగుతారు. లేదంట? వేరే రంగంలో ఉంటారని తేల్చి చెప్పారు. మీ పిల్లలకంటే మీరే ఇంకా గ్లామర్‌గా ఉన్నారనే ప్రశ్నకు బదులిస్తూ...అదంతా దైవ ప్రసాదం. అందుకే ఈ దేహాన్ని అదుపాజ్ఞలలో ఉంచుకుంటాను. పరిమిత ఆహారం, చేస్తే యోగా చేస్తాను. లేదంటే వ్యాయామం చేస్తాను. నేను గత జన్మలో కంచును మింగానేమో..అందుకే కంచుకంఠం వచ్చిందంటూ నవ్వారు. మళ్ళీ మరోసారి కామెడీ విలన్ గా మనముందుకురానున్నాడు. ఆయన గతంలో 'కొదమసింహిం", 'పదహారేళ్ల వయసు", 'దేవత" లాంటి చాలా చిత్రాల్లో కామెడీ విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. 15 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ కామెడీ విలన్ గా అలరించనున్నారు. సొంత బ్యానర లో రూపొందిన 'సలీం" చిత్రంలో కామెడీ విలన్ గా నటించారు. విష్ణు, ఇలియానా జంటగా వై.వి.యస్. చౌదరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. 'సలీం" డిసెంబర్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X