మోహన్ బాబు 'ఓజో' మెన్...ఏంటి సంగతి

By Srikanya

మోహన్ బాబు స్వీయబ్యానర్ లో రూపొందిన సలీం చిత్రంలో కామిడీ డాన్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఆ పాత్ర పేరు ఓజో అని తెలుస్తోంది. అతని పేరు ఓగిరాల జోగయ్య. అందరూ అతన్ని ఓజో అని పిలుస్తూంటారు. ఈ నెల పదకొండున ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు వర్ధన్ బాబు ఈ చిత్రంలో సలీం పాత్రను పోషిస్తున్నారు. అతని ప్రేయసి..సత్య గా ఇలియానా కనపడి కవ్వించనుంది. 'చిట్టి'గా మరో పాత్రలో కావేరీ ఝా నటించారు. వై.వి.ఎస్.చౌదరి ఒక్క మగాడు ఫెయిల్యూర్ తర్వాత కొద్ది గ్యాప్ తర్వాత 'సలీమ్' (దుమ్ము రేపుతాడు) చిత్రం ద్వారా మరోసారి సంచనలనం సృష్టించేందుకు సన్నద్ధమవుతున్నారని చెప్తున్నారు. ఇక శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, రిలయెన్స్ బిగ్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన 'సలీమ్' చిత్రాన్ని యు.ఎస్.ఎ. ఇన్ కార్పేరేషన్ సంస్థ గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ తో కలిసి ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ చేయనుంది.

ఈ సలీం చిత్రాన్ని దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ సెంటర్లలో కూడా విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రలో 36 ప్రింట్లతో విడుదలకు సిద్ధం చేస్తుండగా, ఢిల్లీలో 5 ప్రింట్లతో రిజీల్ కానుంది. ఓవరాల్ గా 295 ప్రింట్లతో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత డాక్టర్ ఎం.మోహన్ బాబు సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో 102 డిజిటల్ ప్రింట్లు ఉండటం విశేషం. 23 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది.ఈ చిత్రంలో మిగతా పాత్రల్లో గిరిబాబు, నెపోలియన్, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, ముఖేష్ రుషి కనిపిస్తారు. ఈ చిత్రానికి చింతపల్లి రమణ మాటలు, చంద్రబోస్ పాటలు, సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, సందీప్ చౌతా సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X