»   » టూరిస్ట్ గైడ్ గా మోహన్ బాబు

టూరిస్ట్ గైడ్ గా మోహన్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

  హైదరాబాద్ :మంచు కుటుంబ చిత్రంగా చెబుతున్న 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 31న విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిత్రంలో తన పాత్ర గురించి మోహన్ బాబు రివిల్ చేసారు. ఈ చిత్రంలో ఆయన టూరిస్ట్ గైడ్ గా కనిపించనున్నారని చెప్తున్నారు. తన పాత్ర గురించి దర్శకుడు చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యానని,తన పాత్ర తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మోహన్ బాబు. అలాగే చిత్రం దాదాపు 30 కోట్లు దాకా బడ్జెట్ అయ్యిందని మోహన్ బాబు చెప్తున్నారు.

  'గోల్‌మాల్-3' చిత్రానికి రీమేగా శ్రీవాస్ దర్శకత్వంలో మోహన్‌బాబు, మంచు విష్ణు, మనోజ్, రవీనాటాండన్, హన్సిక ప్రధాన తారాగణంగా రూపొందుతున్న ఈ చిత్రం గూర్చి నిర్మాత విష్ణు మాట్లాడుతూ- ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోందని, తమ్ముడు, నేను, నాన్న కలిసి తొలిసారిగా నటించిన ఈ చిత్రం వైవిధ్యంగా ఉంటుందని, మనోజ్ పోషించిన లేడీగెటప్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, ఈనెల 31న అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేస్తున్నామని, ప్రేక్షకులు తప్పక విజయాన్ని అందిస్తారని కోరుకున్నారు.

  శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్-24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై అరియానా-వివియానా సమర్పణలో మంచు విష్ణువర్ధన్-మనోజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
  మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ కథానాయకులుగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీ స్టారర్లో రవీనా టండన్, హన్సిక, ప్రణీత హీరోయిన్లు. 'లక్ష్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.

  ఈ చిత్రానికి సంగీతం : కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్, కెమెరా : ఫలణికుమార్, పాటలు: చంద్రబోస్-భాస్కరభట్ల-అనంత శ్రీరామ్, మాటలు: డైమండ్ రత్న, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్-బివిఎస్ రవి-గోపీ మోహన్, పోరాటాలు: విజయ్, ఎడిటింగ్: ఎంఆర్ వర్మ, కళ: రఘు కులకర్ణి, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విజయ్ కుమార్.ఆర్, సమర్పణ: అవియానా-వివియానా, నిర్మాతలు : మంచు విష్ణువర్ధన్, మంచు మనోజ్, దర్శకత్వం: శ్రీవాస్.

  English summary
  Mohan Babu said, “I’m playing the role of a tourist guide in Pandavulu Pandavulu Thummeda film. I got very excited when I heard about the role and I’m confident that it’ll impress everyone. After listening to the story, I felt that it’s the right film to make my comeback and we produced it as well.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more