'ఒక్క ఛాన్సు' అంటున్న మోహన్ బాబు
క్రమశిక్షణ, పంక్చువాలిటీకి ఎన్టీఆర్ తర్వాత ఎవరు అన్న ప్రశ్నకు టక్కున మోహన్ బాబు అని చెప్పవచ్చు. ఐదు వందల చిత్రాల్లో నటించిన అనుభవం ఆయన సొంతం. తానెంత సీనియర్ నటుడైనా దర్శకుడి సూచనల మేరకు నటిస్తారు అన్న పేరుంది. యమదొంగ సినిమా చేస్తున్నప్పుడు దర్శకుడు రాజమౌళి నటించి చూపిస్తుంటే శ్రద్ధగా గమనించి, ఆయన సూచనల మేరకే నటించాడని రాజమౌళి ఎన్నో సంధర్భాల్లో చెప్పకున్నాడు. ఎక్కడా తానో సీనియర్ నటుడన్న ఇగో ప్రదర్శించలేదని చెప్పేవాడు.
ఇటీవల జరిగిన 'మహాత్మ' ఆడియో విడుదల కార్యక్రమంలో ఈ విషయం స్పష్టమవుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైన మోహన్ బాబు మాట్లాడుతూ "కృష్ణవంశీ అద్భుతమైన దర్శకుడని, ఆయన సినిమాలో నటించాలని ప్రతి నటుడూ కోరుకుంటాడని" ప్రశంశించారు. అంతే కాకుండా తనకూ కృష్ణవంశీ దర్శకత్వంలో నటించాలని వుందని, ఎప్పుడూ ఏమయ్యా నీ సినిమాలో ఏదైనా వేషం వుందా అని అడుగుతూ ఉంటానని చెప్పారు. తానో సీనియర్ నటుడన్న గర్వం ఏ మాత్రం లేకుండా ఆయన మాట్లాడిన తీరును అక్కడున్న వారంతా ప్రశంశించారు


Click it and Unblock the Notifications











