నీకు నీ భార్యకు సంబంధం ఏంటన్న మోహన్ బాబు.. మంచు మనోజ్ అలాంటి సమాధానం!
ఫ్యామిలీ అన్నాక గొడవలు అనేవి సర్వసాధారణం. అయితే సెలబ్రిటీల ఇళ్లల్లో జరిగే విభేదాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే ఇప్పుడు అలా మంచు ఫ్యామిలీ విభేదాలు తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మంచు మోహన్ బాబు కుమారులు అయిన మంచు విష్ణు, మంచు మనోజ్ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నట్లుగా ఇటీవల ఒక వీడియో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.
అన్నదమ్ముల్లు అన్నాక గొడవలు సాధారణం అని ఇదివరకే మోహన్ బాబు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన పెద్దగా క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో ఈ విషయం గురించి మోహన్ బాబు, మంచు మనోజ్ ఇద్దరూ తాజాగా రియాక్ట్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే..

మనోజ్-విష్ణు విభేదాలు: సినీ ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. కలెక్షన్ కింగ్ అని ఆయన్ను ముద్దుగా పిలుచుకుంటారు. అయితే ఇటీవల ఆయన కుటుంబానికి సంబంధించిన విషయాలు బహిర్గతం అయిన విషయం తెలిసిందే. ఆయన కుమారులు, అన్నదమ్ములు, హీరోలు అయిన మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలు ఉన్నట్లు గత కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తూ వచ్చాయి. ఇద్దరి మధ్య దూరం ఉందని పుకార్లు వినిపించాయి.
మోహన్ బాబు సీరియస్: ఇక మంచు మనోజ్ ఇంతకుముందు షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో తమ బంధువు అయిన సారథి అనే వ్యక్తి వద్దన్న వినిపించుకోకుండా అతని ముఖంపై విష్ణు కొట్టినట్లు తెలిసింది. ఈ వీడియోతోనే మంచు మనోజ్, విష్ణుకు మధ్య గొడవలు ఉన్నట్లు అందరూ భావించారు. దీంతో మనోజ్ షేర్ చేసిన ఈ వీడియోపై మోహన్ బాబు సీరియస్ కూడా అయ్యారు. కుటుంబంలో జరిగే గొడవలను సోషల్ మీడియాలో పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇగోకి వెళ్లే ఇదంతా: తండ్రి మోహన్ బాబు సీరియస్ కావడంతో మంచు మనోజ్ పెట్టిన పోస్ట్ ను డిలీట్ చేశాడు. మంచు మనోజ్, విష్ణుకు మధ్య ఆస్తి గొడవలు ఎప్పటి నుంచో ఉన్నాయని, అది ఇలా బయటపడిందని పలువురు అనుకున్నారు. ఇక విష్ణు చూసుకునే బాధ్యతల్లో తలెత్తిన సమస్య వల్లే ఇదంతా జరిగిందని మంచు ఫ్యామిలీకి సన్నిహితుడు, నిర్మాత, నటుడు త్రిపురనేని చిట్టి బాబు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మోహన్ బాబుకు చెప్పి పరిష్కరిస్తే అయిపోయే సమస్యను విష్ణు ఇగోకి పోయి ఇక్కడి దాకా తెచ్చాడని చెప్పుకొచ్చారు.
బకరాలను చేశారా: ఇదిలా ఉంటే ఈ గొడవ తర్వాత మనోజ్ పెట్టిన పలు పోస్ట్ లు అన్నయ్య విష్ణుతో గొడవ ఉన్నట్లుగా హింట్ ఇచ్చేలా ఉన్నాయి. ఇక తమ మధ్య జరిగింది గొడవ కాదని, హౌజ్ ఆఫ్ మంచు అనే రియాలిటీ షో అని వార్తలు వచ్చాయి. అందుకు కారణం మంచు విష్ణు షేర్ చేసిన హౌజ్ ఆఫ్ మంచు ప్రమోషనల్ వీడియోనే. ఈ వీడియో విడుదల అయ్యాక ప్రేక్షకులను బకరాలను చేశారా అని కామెంట్స్ వినిపించాయి. మరి ఇలా ఆడుకోవడం అవసరమా అని నెటజన్లు విమర్శించారు.
వీడియోతో కవర్ చేశారని: అయితే మరోవైపు నిజంగానే జరిగిన గొడవను ఇలా కవర్ చేశారని కూడా మరికొంతమంది వ్యాఖ్యానించారు. మనోజ్ షేర్ చేసిన వీడియో సాధారణమైన ఫోన్ లో చిత్రీకరించారని, విష్ణు షేర్ చేసిన హౌజ్ ఆఫ్ మంచు వీడియో మాత్రం ఫుల్ క్లారిటీతో కెమెరా ద్వారా చిత్రీకరించినట్లు ఉందని తేడాలు వెతికారు. ఇదిలా ఉంటే తాజాగా తిరుపతిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి మోహన్ బాబుతోపాటు మంచు మనోజ్, అతని భార్య భూమ మౌనిక రెడ్డి కూడా హజరయ్యారు.

నేను వచ్చిన పనేంటీ.. మంచివాళ్లు: విష్ణు-మనోజ్ గురించి మోహన్ బాబును మీడియా ప్రశ్నించగా.. "నీ ఇంట్లో నీ భార్యకు.. నీ మధ్య సంబంధం ఏమిటో చెప్పగలవా.. తప్పయ్యా.. చదువుకున్న విజ్ఞానులు మీరు. మీరుందరూ నాకు ఇష్టం. ఎప్పుడు ఏది అడగాలో అది అడగాలి. సమయం సందర్భం ఉండాలి. మీరందరూ తెలుసు. మీరందరూ నాకు కావాలి. నేను వచ్చిన పనేంటి హాస్పిటల్ ఓపెనింగ్. ఇది అత్యద్భుతంగా ఉండాలి. డాక్టర్స్ మంచివాళ్లు ఉన్నారు. నా అభినందనలు" అని రివర్స్ క్వశ్చన్ చేశారు.
రీసెంట్ గా వచ్చిన సమస్య: అనంతరం మనోజ్ మీడియాతో ముచ్చటించారు. "వాట్ ది ఫిష్, మనం మనం బరంపురం సినిమాలు స్టార్ట్ చేస్తున్నాను. కెనడాలో షూటింగ్ చేస్తాం. త్వరలో సినిమా క్యాస్ట్, షెడ్యూల్స్ అన్ని అప్డేట్ ఇస్తాం" అని మనోజ్ తెలిపాడు. అప్పుడు 'రీసెంట్ ఇష్యూస్ ఏంటీ, క్లారిటీ ఇస్తే బాగుంటుంది' అని రిపోర్టర్ అడగ్గా.. "నాకు చిన్న సగ్గెడ్డ వచ్చిందండి. గోకుతారా" అని మనోజ్ నవ్వుతూ వ్యంగంగా సమాధానం ఇచ్చాడు. 'అది కాదు సర్' అని రిపోర్టర్ మళ్లీ అంటే.. "నాకు రీసెంట్ గా వచ్చిన సమస్య ఇదే" అని మనోజ్ దాట వేశాడు.


Click it and Unblock the Notifications











