మంగళవారం తిరుపతికి రావద్దు : మోహన్‌బాబు
"ఇటీవల మా నాన్నగారు పరమపదించిన సందర్భంగా ఈ సంవత్సరం మార్చి 19న నా జన్మదిన వేడుకను జరుపుకోవడం లేదు. ఆ రోజు తిరుపతికి సమీపంలో నెలకొల్పిన శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ఆవరణలో ఉంటాను. అందుకని నా అభిమానులెవరూ తిరుపతికి రావద్దు. కావాలంటే ఫోన్లు చేసి శుభాకాంక్షలు అందజేయండి'' అని కోరారు సీనియర్ నటుడు, నిర్మాత డాక్టర్ మోహన్‌బాబు.
అలాగే తన తండ్రి పేరిట ఈ ఏడాది నుంచి ఎలిమెంటరీ పాఠశాల స్థాయిలో ఉత్తమ సేవలందించిన ఓ ఉపాధ్యాయునికి 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డుని అందజేస్తామని మోహన్‌బాబు ప్రకటించారు. అవార్డుతో పాటు కొంత నగదు బహుమతినీ ఇస్తామన్నారు. ''నా తండ్రి మంచు నారాయణస్వామి నాయుడు ఉపాధ్యాయుడిగా ఎంతోమందికి విద్యాబుద్ధులు అందించారు.
తన తండ్రి జ్ఞాపకార్థం ప్రతి యేటా విద్యారంగంలో ఉత్తమశ్రేణి సేవలందించిన ఉపాధ్యాయుడికి పురస్కారం అందించాలని నిర్ణయించాను. ఈ యేడాది నుంచే ఆ పురస్కార ప్రదానం ఉంటుంద''న్నారు ప్రముఖ నటులు మోహన్‌బాబు. ఆయన ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు.


Click it and Unblock the Notifications












