twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంగళవారం తిరుపతికి రావద్దు : మోహన్‌బాబు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ''ఇటీవలే నా తండ్రి మరణించారు. అందుకే మంగళవారం నా జన్మదిన కార్యక్రమాల్ని నిర్వహించుకోవడం లేదు. తిరుపతి శ్రీవిద్యానికేతన్‌కే పరిమితమవుతాను. అయితే ప్రతి యేటా మార్చి 20, 21 తేదీల్లో నిర్వహించే విద్యానికేతన్‌ కార్యక్రమాలు యథాతథంగా సాగుతాయి''అంటున్నారు మోహన్ బాబు. మార్చి 19న తన జన్మదిన వేడుకలు జరపకుండా 20, 21 తేదీల్లో విద్యా సంస్థల వేడుకను మాత్రం యథాప్రకారం జరుపుతామనీ, ఈ వేడుకల్లో డ్రమ్స్ శివమణి, సంగీత దర్శకులు మణిశర్మ, చక్రి పాల్గొని ఆహూతుల్ని అలరిస్తారని ఆయన తెలిపారు.

    "ఇటీవల మా నాన్నగారు పరమపదించిన సందర్భంగా ఈ సంవత్సరం మార్చి 19న నా జన్మదిన వేడుకను జరుపుకోవడం లేదు. ఆ రోజు తిరుపతికి సమీపంలో నెలకొల్పిన శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ఆవరణలో ఉంటాను. అందుకని నా అభిమానులెవరూ తిరుపతికి రావద్దు. కావాలంటే ఫోన్లు చేసి శుభాకాంక్షలు అందజేయండి'' అని కోరారు సీనియర్ నటుడు, నిర్మాత డాక్టర్ మోహన్‌బాబు.

    అలాగే తన తండ్రి పేరిట ఈ ఏడాది నుంచి ఎలిమెంటరీ పాఠశాల స్థాయిలో ఉత్తమ సేవలందించిన ఓ ఉపాధ్యాయునికి 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డుని అందజేస్తామని మోహన్‌బాబు ప్రకటించారు. అవార్డుతో పాటు కొంత నగదు బహుమతినీ ఇస్తామన్నారు. ''నా తండ్రి మంచు నారాయణస్వామి నాయుడు ఉపాధ్యాయుడిగా ఎంతోమందికి విద్యాబుద్ధులు అందించారు.

    తన తండ్రి జ్ఞాపకార్థం ప్రతి యేటా విద్యారంగంలో ఉత్తమశ్రేణి సేవలందించిన ఉపాధ్యాయుడికి పురస్కారం అందించాలని నిర్ణయించాను. ఈ యేడాది నుంచే ఆ పురస్కార ప్రదానం ఉంటుంద''న్నారు ప్రముఖ నటులు మోహన్‌బాబు. ఆయన ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు.

    English summary
    Mohan Babu revealed that he will be constituting awards for best teachers on his late Father Narayanaswamy Naidu. He said he will honor best teacher from elimentary school and will felicitate him with cash prize and award on 20,21 during his Vidyaniketan educational instituions anniversary function. The function will have Manisharma and Chakri's musical night.He said he won't be celebrating his birthday on 19th March due to his father's death. He requested fans not to come to wish him and informed he will be at Vidyaniketan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X