శోకసంద్రంలో టాలీవుడ్.. కన్నీటి పర్యంతమైన బ్రహ్మానందం..స్పందించిన బాలయ్య, మోహన్ బాబు

Recommended Video

శోకసంద్రంలో టాలీవుడ్

గుండు హనుమంత రావు మృతితో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. 400 పైగా చిత్రాల్లో నటించిన హనుమంతరావు టాలీవుడ్ లో అనేకమంది ప్రముఖులతో స్నేహం చేసారు. ప్రముఖులంతా తరలివచ్చి ఆయన భౌతిక ఖాయానికి నివాళులు అర్పిస్తున్నారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న హనుమంత రావు సోమవారం తెల్లవారు జామున 3:30 గంటలకు తుది శ్వాస విడిచారు. బ్రహ్మానందం, శివాజీ రాజా, గౌతమ్ రాజు, మోహన్ బాబు, బాలయ్య వంటి ప్రముఖులంతా హనుమంత రావు మృతికి సంతాపం తెలియజేసారు.

బావ అని పిలిచేవాడు..కన్నీటి పర్యంతమైన బ్రహ్మానందం

బావ అని పిలిచేవాడు..కన్నీటి పర్యంతమైన బ్రహ్మానందం

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం గుండు హనుమంత రావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం బ్రహ్మానందం.. హనుమంత రావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరు కార్చారు. హనుమంత రావు ఇటీవల తన నివాసానికి వచ్చారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు లేరంటే నమ్మలేకపోతున్నానని అన్నారు. హనుమంతరావు తనని ఆప్యాయంగా బావ అని పిలిచేవారని బ్రహ్మానందం గుర్తు చేసుకున్నారు.

ఇద్దరికీ ఆ చిత్రంతో గుర్తింపు

ఇద్దరికీ ఆ చిత్రంతో గుర్తింపు

తామిద్దరం అహనా పెళ్ళంట చిత్రంలో నటించామని బ్రహ్మానందం తెలిపారు.ఆ చిత్రం ద్వారానే తామిద్దరికి మంచి గుర్తింపు లభించినట్లు బ్రహ్మి గుర్తుచేసుకున్నారు.

 స్నేహితుడు లేడన్న దుఃఖంలో

స్నేహితుడు లేడన్న దుఃఖంలో

గుండు హనుమంతరావుకు కమెడియన్ గౌతమ్ రాజు మంచి స్నేహితుడు. హనుమంత రావు మరణించాడనే వార్త తెలియగానే ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆయన ఆపుకోలేక పోయారు.

సహచర నటులంతా

సహచర నటులంతా

హనుమంత రావుతో కలసి నటించిన సహచర నటులంతా ఆయన భౌతిక కాయానికిని నివాళులు అర్పించారు. శివాజీ రాజా, కాదంబరి కిరణ్, రాజేంద్ర ప్రసాద్ మరియు మురళి మోహన్ వంటి ప్రముఖులు హనుమంత రావు మృతి పట్ల సంతాపం తెలియజేసారు.

మోహన్ బాబు స్పందన

మోహన్ బాబు స్పందన

హనుమంత రావు మృతి పట్ల మోహన్ బాబు తన స్పందన తెలియజేసారు. హనుమంతరావు మంచి నటుడే కాదు.. అంతకుమించిన మంచి వ్యక్తి కూడా అని మోహన్ బాబు అన్నారు. లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ లో వచ్చిన పలు చిత్రాల్లో హనుమంతరావు నటించారని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. ఎలాంటి పాత్రనైనా సమర్ధవంతగా పోషించినగల నటుడు హనుమంత రావు. అలాంటి వ్యక్తి ఇప్పుడు లేరంటే నమ్మలేకున్నానని మోహన్ బాబు అన్నారు.

తీరని లోటన్న బాలయ్య

తీరని లోటన్న బాలయ్య

తెలుగు ప్రేక్షకులందరికి తన హాస్యాన్ని పంచిన నటుడు హనుమంతరావు మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని బాలకృష్ణ అన్నారు. హనుమంత రావుతో కలసి తాను కొన్ని చిత్రాల్లో నటించానని ఆయన మృదు స్వభావి అని బాలయ్య తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలిగి, కుటుంబానికి మనో ధైర్యాన్ని ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు బాలయ్య తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X