మోహన్ బాబుకు ఈ సమాజం ఎంతో ఇచ్చింది... ఇలా తిరిగిచ్చేస్తున్నాడు!

ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు ఆదివారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలోని శ్రీ విద్యానికేతన విద్యాసంస్థల్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు, పల

By Bojja Kumar

హైదరాబాద్: ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు ఆదివారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలోని శ్రీ విద్యానికేతన విద్యాసంస్థల్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా మంచు ఫ్యామిలీ కుటుంబ సభ్యులు సినీ ప్రముఖులకు సన్మానం చేసారు. వక్తలు మాట్లాడుతూ మోహన్ బాబు సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ అతడు చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు.

మోహన్ బాబు

మోహన్ బాబు

మోహన్‌బాబు మాట్లాడుతూ.. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నారని.. అందుకే వారు పెడదారిన పడుతున్నారని తెలిపారు. పిల్లలతో తల్లిదండ్రులు రోజూ మూడు నుంచి నాలుగు గంటలు గడపాలని అప్పుడే వారికి ప్రేమానురాగాలు అందుతాయన్నారు. మంచి బుద్దులు నేర్పి పిల్లలను సమాజానికి సమాజానికి ఉపయోగపడేలా తీర్చి దిద్దే బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు.

కోటి రూపాయల నిధి

కోటి రూపాయల నిధి

శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల సీఈవోగా మంచు విష్ణు మాట్లాడుతూ...పారిశ్రామిక రంగంలోకి అడుగు పెట్టాలనుకునే విద్యార్థుల కోసం మోహన్‌బాబు కోటిరూపాయల నిధిని ఏర్పాటు చేశారన్నారు.

సమాజం చాలా ఇచ్చింది

సమాజం చాలా ఇచ్చింది

ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ...‘సామాన్యుడిగా పుట్టిన మోహన్‌బాబును ఈ సమాజం పద్మశ్రీని చేసిందని, ఆయనకు ఎంతో ఇచ్చింది. సమాజం నుంచి తీసుకున్న దానిని ఉంతో కొంత ఏదో ఒక రూపంలో తిరిగి ఇచ్చేయాలనే ఉద్దేశ్యంలో మోహన్‌బాబు విద్యాదానం చేస్తున్నారంటూ అభినందించారు.

వినాయక్

వినాయక్

ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు వివి వినాయక్‌ మాట్లాడుతూ మోహన్‌బాబు సినిమాను ఎంత ఇష్టపడతారో విద్యానికేతన్‌ని కూడా అం తే ఇష్టపడతారని తెలిపారు. సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో ఆయన తనదైన ముద్ర వేసారని ఈ సందర్భంగా వినాయక్ చెప్పుకొచ్చారు.

లక్ష్మీ కటాక్షం

లక్ష్మీ కటాక్షం

సీనియర్‌ నటుడు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడుతూ శ్రీ విద్యానికేతన్‌లో చదువుకున్న వారికి సరస్వతితోపాటు లక్ష్మీకటాక్షం కూడా ఉంటుందన్నారు. మోహన్ బాబు గారి ఆధ్వర్యంలో ఇంత గొప్పసంస్థ నడుస్తుండటం ఆనందంగా ఉందన్నారు.

క్రిష్

క్రిష్

ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్‌ మాట్లాడుతూ కలను సాకారం చేసుకున్న మోహన్‌బాబును దగ్గరగా చూస్తుండటం ఆనందంగా ఉందన్నారు. సినీ పరిశ్రమలో ఆయన ఎందరికో ఆదర్శవంతుడని ఈ సందర్భంగా క్రిష్ కొనియాడారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X