»   »  మోహన్ బాబు ఆఫీస్ ఎత్తేయడం వెనక కారణం ఏంటి?

మోహన్ బాబు ఆఫీస్ ఎత్తేయడం వెనక కారణం ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్లో అటు సినిమాల నిర్మాణం పరంగా, నటీనటుల పరంగా పాతుకు పోయిన ఫ్యామిలీల్లో మోహన్ బాబు ఫ్యామిలీ ఒకటి. గత కొన్నేళ్లుగా మోహన్ బాబు ఫ్యామిలీ నిర్వహిస్తున్న సినిమా కార్యకలాపాలకు కేంద్రంగా మాధాపూర్ ఏరియాలో ఆఫీసు ఉండేది.

అయితే ఉన్నట్టుండి మాధాపూర్ నుండి ఆఫీస్ ఎత్తేసారు. కొత్తగా మణికొండ ఏరియాలో కార్యాలయం ఏర్పాటు చేసారు. ఇపుడు వ్యవహారాలన్నీ అక్కడి నుండే సాగుతున్నాయి. అయితే ఉన్నట్టుండి మోహన్ బాబు ఇలాంటి మార్పులు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

Mohan Babu

ఈ మార్పులకు కారణం మాధాపూర్‌ ఆఫీసులో వాస్తు సరిగా లేక పోవడమే అంటున్నారు. ఈ మధ్య కాలంలో మంచి ఫ్యామిలీ నిర్మించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద సరిగా ఆడటం లేదు. ఈ కారణంగానే మోహన్ బాబు ఈ నిర్ణక్ష్ం తీసుకున్నారట. మోహన్ బాబు గతేడాది ఫిల్మ్ నగర్ లోని తన ఇంటిని కూతురు లక్ష్మికి గిఫ్టుగా ఇచ్చి శంషాబాద్ ఫిప్టయిన సంగతి తెలిసిందే.

ఈ మార్పులన్నింటికీ మోహన్ బాబుకు వాస్తుపై ఉన్న నమ్మకమే కారణమని అంటున్నారు. ఆయన వాస్తు నిపుణులను కలిసిన తర్వాత వారి సూచన మేరకు ఆఫీసులో మార్పలతో పాటు, తన ఇంట్లో కూడా కొన్ని మార్పులు చేసారని చెబుతున్నారు. మరి ఈ మార్పుల తర్వాత అయినా మంచు ఫ్యామిలీకి సినిమా బిజినెస్ లో లక్కు కలిసొస్తుందో? లేదో? చూడాలి.

English summary
Mohan Babu has been operating out of an office in the Madhapur area since the last few years. Sources say that Mohan Babu blamed the Madhapur office’s poor vasthu for the string of bad runs at the Box Office.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu