బ్రహ్మీ, మోహన్ బాబు పద్మశ్రీ వివాదం, తిప్పలు తప్పవా?
హైదరాబాద్: భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పురస్కారమైన పద్మ శ్రీ అవార్డులను అగౌరవ పరిచారనే కేసులో.....తెలుగు సినీ నటులు మోహన్ బాబు, బ్రహ్మానందంలకు తిప్పలు తప్పేట్లు లేవు. ఈ విషయమై బీజేపి నేత ఇంద్రసేనా రెడ్డి రాష్ర్ట హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా....అవార్డులను వెనక్కి ఇచ్చేయాలని కోర్టు రెండు వారాల క్రితం ఆదేశించిన సంగతి తెలిసిందే.
అయితే...'దేనికైనా రెడీ' చిత్రంలో తమ ప్రమేయం లేకుండా పేర్ల ముందు పద్మశ్రీ వాడారని....మోహన్ బాబు, బ్రహ్మానందం కోర్టుకు విన్నవించడంతో.......సినిమా నుండి పద్మశ్రీ తొలగించాలని, ప్రమేయం లేకుండా పద్మశ్రీ వాడిన విషయమై అఫిడవిట్లను దాఖలు చేయాలని కోర్టు ఇటీవల ఆదేశించింది.
కాగా....సినిమా పేర్ల నుంచి పద్మశ్రీ పేరును తొలగించినట్లు మోహన్ బాబుకు కోర్టుకు ఈరోజు తెలిపారు. ఇదిలా ఉంటే......ఇంద్రసేనా రెడ్డి మరో వాదన తెరపైకి తెచ్చారు. 'ఝుమ్మందినాధం' చిత్రంలో తెలిసే 'పద్మశ్రీ' వాడారని ఆయన కోర్టుకు తెలిపారు. దీంతో బ్రహ్మానందం, మోహన్ బాబులకు తిప్పట్లు లేవని పలువురు అభిప్రాయ పడుతున్నారు.


Click it and Unblock the Notifications












