ఆ టైమ్‌లో పవన్ కళ్యాణ్ రియాక్షన్! పవన్ స్టార్‌పై మంచు విష్ణు సంచలన కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటులైన మోహన్ బాబు, చిరంజీవి మధ్య కొన్ని దశాబ్దాలుగా మంచి అనుబంధం ఉంది. మెగా ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ ఎప్పుడూ కలసిమెలసి ఉంటూ ఇరు కుటుంబాల్లో ఒకరి పార్టీలకు మరొకరు వెళ్లేవారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. గత కొన్నేళ్ల క్రింద చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు వచ్చిన సమయంలో జరిగిన సంఘటనను మాత్రం ఎవ్వరూ మరచిపోలేరు. తాజాగా ఈ అంశం గురించి స్పందించారు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు. వివరాల్లోకి పోతే..

మంచు విష్ణు కెరీర్.. ధైర్యంగా మంచు వారబ్బాయి

మంచు విష్ణు కెరీర్.. ధైర్యంగా మంచు వారబ్బాయి

మోహన్ బాబుకు వారసుడిగా సరిగ్గా 17 ఏళ్ల క్రితం వెండితెరకు పరిచయమైన మంచు విష్ణు ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషిస్తూ కెరీర్ ముందుకు సాగించారు. జయాపజయాలు ఎన్ని ఎదురైనా ధైర్యంగా సినిమాలు చేస్తూ వస్తున్న ఆయన.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవికి పద్మభూషణ్.. మెగాస్టార్‌ని ఉద్దేశిస్తూ మోహన్ బాబు

చిరంజీవికి పద్మభూషణ్.. మెగాస్టార్‌ని ఉద్దేశిస్తూ మోహన్ బాబు

మెగాస్టార్ చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా అప్పట్లో తెలుగు సినీ పరిశ్రమ ఆయనకు ఘన సన్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు మోహన్ బాబు సహా తెలుగు సినీ పరిశ్రమ పెద్దలంతా హాజరయ్యారు. అయితే ఆ సమయంలో వేదికపై మాట్లాడిన మోహన్ బాబు.. చిరంజీవిని ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. ఆ సంఘటనలు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

 మోహన్ బాబును తమ్ముడూ అనేసిన పవన్..

మోహన్ బాబును తమ్ముడూ అనేసిన పవన్..

ఇక అదే వేదికపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాస్త ఆవేశంగా మాట్లాడుతూ మోహన్ బాబును తమ్ముడూ అంటూ సంబోధించడం మరింత సెన్సేషన్ అయింది. ఆ తర్వాత అన్నయ్య చిరంజీవిని ఆకాశానికి ఎత్తుతూ మాట్లాడారు పవన్. మొత్తానికి ఈ ఇష్యూ నేటికీ ఎవ్వరూ మరచిపోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై మంచు విష్ణుకు తాజా ఇంటర్వ్యూలో ఓ ప్రశ్న ఎదురైంది.

 పవన్ కళ్యాణ్ ఎందుకలా రియాక్ట్ అయ్యారో..

పవన్ కళ్యాణ్ ఎందుకలా రియాక్ట్ అయ్యారో..

దీనిపై స్పందించిన మంచు విష్ణు.. నాన్నగారికి, చిరంజీవి అంకుల్‌కు ఉన్న సాన్నిహిత్యం గొప్పదని అన్నారు. అందుకే నాన్నగారు అలా మాట్లాడారే తప్ప, ఆ వేడుకలో నాన్నగారు తప్పుగా మాట్లాడలేదనేది తన అభిప్రాయం అన్నారు. ఇకపోతే ఆ టైమ్‌లో పవన్ కళ్యాణ్ ఎందుకలా రియాక్ట్ అయ్యారో అనేది ఈ రోజుకి తనకు క్వశ్చన్ మార్క్ అని చెప్పారు మంచు విష్ణు. మా నాన్నగారికి చిరంజీవి అంకుల్‌తో ఉన్నంత సాన్నిహిత్యం పవన్ కళ్యాణ్‌తో లేదని విష్ణు అన్నారు.

మంచు విష్ణు, కాజల్.. మోసగాళ్లు

మంచు విష్ణు, కాజల్.. మోసగాళ్లు

ప్రస్తుతం మంచు విష్ణు 'మోసగాళ్లు' సినిమా చేస్తున్నారు. చరిత్రలో అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ మిస్టరీని కథాంశంగా తీసుకొని హాలీవుడ్-ఇండియన్ మూవీగా ఈ సినిమాను ఆయనే స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. చిత్రంలో మంచు విష్ణు జోడీగా కాజల్ నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X