twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోజుకొకరిని కొడతాను:మోహన్ బాబు

    By Srikanya
    |

    Mohan Babu
    హైదరాబాద్ :నేను దర్శకుడిని అయితే రోజుకొకరిని కొడతాను. ఆ స్థానంలో ఇమడలేను. ఇటీవల చాలామంది నటులు రోజువారీ కూలీలు అయ్యారు. ఇదివరకు ఓ సినిమాకి చొప్పున ఇంత పారితోషికం అని తీసుకునేవారు. ఇప్పుడు రోజుకింత అని అడుగుతున్నారు. అది కూడా చెప్పిన సమయానికి సెట్‌కి రారు. వచ్చిందే ఆలస్యం... మళ్లీ సెల్‌ఫోన్లలో మాట్లాడుకుంటూ కాలం గడుపుతుంటారు అన్నారు. ఆయన తొలి చిత్రం 'స్వర్గం నరకం' ప్రేక్షకుల ముందుకొచ్చి ఈ నెల 22తో 38 ఏళ్లు పూర్తవుతాయి. ప్రస్తుతం 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రంలో ఓ కథానాయకుడిగా నటిస్తున్న మోహన్‌బాబు మీడియాతో మాట్లాడారు.

    అలాగే ఇంకొంతమందేమో స్వర్గంలో నుంచి వూడిపడినట్టు చేస్తుంటారు. నేను దర్శకుడిని అయితే అలాంటివి అస్సలు క్షమించను. ఇప్పుడు కూడా ఇలాంటి విషయాల్లో కాస్త గట్టిగా అడిగితే... 'మోహన్‌బాబు కంపెనీలో ఎందుకు చేయాలండీ?' అంటారు. నటీనటులు ఎప్పుడు సెట్‌కి వచ్చినా ఏమీ అనకుండా ఉండేవాళ్లు నా దృష్టిలో థర్డ్‌ గ్రేడ్‌ దర్శకులు, నిర్మాతలు. నాన్నగారు చెప్పినట్టు పరుషంగా మాట్లాడకుండా మాత్రం ఉండలేకపోయా. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించే పరిస్థితులు ఇప్పుడు లేవు. రోజురోజుకీ విలువలు దిగజారిపోతున్నాయి అన్నారు.

    ఇక ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలి. దాన్ని ఆవేశం అంటారో, ముక్కోపితనం అంటారో ఇంకేమనుకొంటారో నాకు తెలియదు. నా దృష్టిలో ఆవేశపరుడిగా ఉన్నా ఫర్లేదు గానీ అవినీతి పరుడిగా మాత్రం ఉండకూడదు. సమయం సందర్భం వచ్చినప్పుడే ఆవేశపడతాను. నా ఆవేశం, నా కోపం నాకే చెడు చేసింది తప్ప మరెవ్వరికీ ఇబ్బంది కలిగించలేదు. లోపల ఏదో పెట్టుకొని బయటికి ఇంకేదో మాట్లాడటం నాకు మొదట్నుంచీ అలవాటు లేదు. ఆరోగ్యానికి కూడా అది మంచిది కాదని నా నమ్మకం అని చెప్పుకొచ్చారు.

    ఇంకా మాట్లాడుతూ..నటించే అవకాశం విలన్ కే ఎక్కువగా ఉంటుంది. 'శివరంజని', 'దేవత' చిత్రాల్లో చేసిన పాత్రలంటే నాకు ఇప్పటికీ ఆసక్తే. 'కొండవీటి సింహం'లో అన్నయ్య ఎన్టీఆర్‌కి కొడుకుగా నటించడం ఎప్పటికీ మర్చిపోలేను. నటుడికి ప్రతిసారీ 'అల్లుడుగారు', 'అసెంబ్లీరౌడీ', 'పెదరాయుడు'లాంటి పాత్రలే దొరకాలంటే కష్టం కదా. అందుకే ప్రతినాయక పాత్రలంటే నాకు చాలా ఇష్టం. ఆయా పాత్రల్లో ఎక్కువ మేనరిజమ్స్‌ చూపించింది నేనే అని గర్వంగా చెబుతాను అన్నారు.

    English summary
    'Padmasri' Dr M Mohan Babu, one of the most versatile actors the Telugu film industry have produced, celebrates his 38th Industry birthday today. He is known for his discipline at the sets and surrendering to any role he acts. He is an adept in telling dialogues and playing any kind of emotions. He has shown variations in the roles he selects all through his career and he gave 100% to all of them.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X