సితారతో కలిసి ఛాలెంజ్ ఫినిష్ చేసిన మహేష్ బాబు!
Recommended Video

పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొన్ని రోజులుగా గ్రీన్ ఛాలెంజ్ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు మొక్కలు నాటుతూ ఛాలెంజ్ విసురుతున్నారు. ఇటీవల ఎంపీ కవిత నుండి గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన దర్శకుడు రాజమౌళి... తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో పాటు పుల్లెల గోపీచంద్, దర్శకుడు సందీప్ వంగా, నాగ్ అశ్విన్ తదితరులకు ఛాలెంజ్ విసిరాడు. రాజమౌళి నుండి ఛాలెంజ్ స్వీకరించిన కేటీఆర్... యూఎస్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా, మహేష్ బాబు తదితరులకు ఛాలెంజ్ విసిరారు.
మోహన్ బాబుకు ఛాలెంజ్
మంత్రి కేటీఆర్ నుండి ఆ సవాల్ ని స్వీకరించిన యూఎస్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ దానిని పూర్తిచేసి, ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు ఈ ఛాలెంజ్ విసిరారు. కేథరిన్ ఛాలెంజ్ ను పూర్తి చేసిన మోహన్ బాబు ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.
ప్రతి ఒక్కరూ భాగం కావాలన్న మోహన్ బాబు
‘నా ఛాలెంజ్ పూర్తి చేశాను. విద్యానికేతన్ లోని మా పిల్లలు కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రతిఒక్కరూ ఈ ఛాలెంజ్ ను స్వీకరించాలని కోరుతున్నా. మనకు ఇంకా ఎక్కువ పచ్చదనం కావాలి. మీరు మొక్కలు నాటుతున్న ఫొటోలను నాకు పంపండి' అంటూ ట్వీట్ చేశారు.
మహేష్ బాబు
మహేష్ బాబు కూడా గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించారు. తన కూతురు సితారతో కలిసి మొక్కలు నాటారు.
రాజమౌళికి
రాజమౌళి నుండి గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన కేటీఆర్.


Click it and Unblock the Notifications











