Just In
- 1 min ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 57 min ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
- 1 hr ago
ఆ విషయాల్లో ఎప్పుడూ ఆలస్యం అనేది ఉండదు.. సింగర్ సునీత పిక్స్ వైరల్
- 2 hrs ago
మరో మాస్ యాక్షన్ సినిమా కోసం తమిళ దర్శకుడిని లైన్ లో పెట్టిన రామ్
Don't Miss!
- News
నిమ్మగడ్డ సంచలనం: ఇద్దరు కలెక్టర్లు సహా 9మందిపై వేటుకు ఆదేశం -ఎన్నికలకు అడ్డొస్తే అంతే!
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Sports
ఆ రెండు జట్లు సంజూ శాంసన్ ఇవ్వమన్నాయి.. అందుకే రాజస్థాన్ అలా చేసింది!
- Finance
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి రూ.7 కోట్లు టోకరా వేసిన కేటుగాడిపై ఈడీ కేసు, ఆ సంస్థ ఆస్తులు అటా
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నిజమే...మనోజ్ వివాహం ప్రణతితోనే: మోహన్ బాబు
హైదరాబాద్ : మంచు మనోజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో ఊహాగానాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మనోజ్ వివాహం గురించిన సమాచారాన్ని మోహన్ బాబు మీడియాకు తెలిపారు . తన పెద్దకోడలు విరానికా మిత్రురాలైన ప్రణతిని మనోజ్ త్వరలో వివాహమాడబోతున్నారని ఆయన తెలిపారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
మోహన్ బాబు మాట్లాడుతూ...

''గత 40 ఏళ్లుగా నన్నూ, నా కుటుంబాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు, అభిమానులకూ హృదయపూర్వక నమస్కారాలు. ఈ మధ్య కొన్ని ఛానెల్స్ లోనూ, కొన్ని పత్రికల్లోనూ మనోజ్ కుమార్ వివాహ విషయమై వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు సంభందించి, స్పష్టమైన సమాచారం ఇవ్వడం నా భాధ్యత. నాక్కాబోయే కోడలి పేరు ప్రణతి '' అని మోహన్‌బాబు అన్నారు.
ఇంకా చెబుతూ - ''మా పెద్ద కోడలు విరానికా, ప్రణతి క్లాస్‌మేట్స్. ఆ విధంగా ప్రణతి తల్లిదండ్రులు సత్యనారాయణ, ప్రవీణలతో పరిచయం అయ్యింది. రెండు రోజుల క్రితం మనోజ్,ప్రణతిల పెళ్లి గురించి మాట్లాడుకున్నాం. ఓ శుభముహూర్తాన నిశ్చయ తాంబూలం, అనంతరం పెళ్లి జరుపుతాం. నాక్కాబోయే కోడలు ప్రణతి బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివింది. న్యూయార్క్‌లో సీపీఏ(అమెరికాలో ఛార్టెడ్ ఎక్కౌంట్ ని సీపీఎ అంటారు) చేసింది. మీ అందరి ఆశీస్సులతో వివాహం జరుగుతుంది '' అని మోహన్‌బాబు పేర్కొన్నారు.
మనోజ్ కెరీర్ విషయానికి వస్తే...
మంచు మోహన్ బాబు, విష్ణులతో పని చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, త్వరలో మంచు మనోజ్ ను డైరెక్ట్ చేయడానికి రెడీ అయ్యారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. ప్రతి సినిమాను అతి తక్కువ రోజుల్లో పూర్తి చేసే వర్మ, మనోజ్ సినిమాను ఒక నెల రోజుల్లో ఫినిష్ చేయాలని భావిస్తున్నారట.
మనోజ్, వర్మలు ప్రస్తుతం స్క్రిప్ట్ కు ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్న వార్త నిజమే అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘కరెంట్ తీగ' తర్వాత మంచు మనోజ్ నటిస్తున్న సినిమా ఇది.