Lakshmi Manchu: ప్రేమను అంగీకరించారా... గుండె పగిలిందంటూ మంచు లక్ష్మి సంచలన ట్వీట్
మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో తనదైన మార్కుతో రోల్స్ చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఇక ఈ బ్యూటీ స్టార్ కిడ్ అయినప్పటికీ... అందాల ఆరబోతలోనూ తగ్గేదేలే అన్నట్లుగానే కుర్రాళ్లుక ట్రీట్ ఇస్తుంది. ఇక ఆ విషయం పక్కన పెడితే... సుప్రీం కోర్టు ఓ కీలక తీర్పుపై తన గుండె పగిలిందంటూ ఓ సంచలన ట్వీట్ చేసింది లక్ష్మి, ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మంచు లక్ష్మి.. మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తన అందం, అభినయంతో లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. లక్ష్మి మంచు అందం, అభినయానికే కాదు.. మాటలకు కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది. ఇక ఈమె ఇంగ్లీషుపై ట్రోలింగ్ అవుతూనే ఉంటుంది. ఇప్పటికీ ఈమె మాట్లాడిన వీడియోలు ట్రెండింగ్ లో ఉంటాయి.

ఇక ఇప్పుడుమరోసారి లక్ష్మి మంచు ట్రెండింగ్ లోకి వచ్చింది. దానికి కారణం.. సుప్రీంకోర్టు వెలువరించి తీర్పు. అదేంటంటే... స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్ధత కల్పించే అంశం పై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు మంగళవారం కీలక తీర్పును ఇచ్చింది. తీర్పుపై కొందరు సెలబ్రెటీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మంచు లక్ష్మీ కూడా తన సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై స్పందించింది. గుండె ముక్కలు అయిందంటూ ట్వీట్ చేసింది.
అసలు విషయం ఏంటంటే... స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్ధత కల్పించే అంశం పై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు మంగళవారం కీలక తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎల్‌జిబిటిక్యుఐఎ + వర్గానికి చెందిన వ్యక్తుల వివాహానికి సమాన హక్కులు ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఇక దేశ పార్లమెంటు దీనిపై తేల్చాలని సూచించింది.
అయితే.. వీరు సహజీవనంలో ఉండొచ్చున‌్న న్యాయస్థానం.... అదే సమయంలో స్వలింగ సంపర్క జంటలపై ఎలాంటి వివక్షా చూపించొద్దని, వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని తీర్పును ఇచ్చింది. న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 10 రోజులు పాటు సుదీర్ఘ విచారణ చేపట్టి.. ఈ నిర్ణయం వెల్లడించింది.
అయితే.. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై కొందరు సెలబ్రెటీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం తీర్పుతో నిరాశ చెందినట్లు నటి మంచు లక్ష్మి కూడా తన ట్విట్టర్ వేదికగా స్పందించింది. తన గుండె పగిలిపోయిందని... ప్రేమను పంచే దేశంలో వీరి వివాహాలను అంగీకరించలేరా..? అంటూ రాసుకువచ్చింది. ప్రస్తుతం మంచు లక్ష్మి వైరల్ గా మారింది.
మంచు లక్ష్మి ట్వీట్ చేస్తూ.... స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేయడానికి సుప్రీం కోర్టు నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పుపై అసహనం చెందాను. నా గుండె పగిలిపోయింది. అన్ని రకాల ప్రేమను స్వీకరించి.. మిగతా ప్రపంచానికి ప్రేమను గురించి బోధించిన దేశానికి ఇది నిజంగా అవమానం. ఇతర దేశాల్లో వీరు స్వేచ్ఛగా బతుకుతున్నారు. మనదేశంలో వీరి వివాహాలను అంగీకరించలేమా అంటూ రాసుకువచ్చింది. ప్రస్తుతం లక్ష్మి మంచు ఆది పర్వం అనే సినిమాలో నటిస్తుంది.


Click it and Unblock the Notifications











