»   » డైలాగ్‌ కింగ్ బ్రిటన్‌ పార్లమెంట్‌

డైలాగ్‌ కింగ్ బ్రిటన్‌ పార్లమెంట్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమా పరిశ్రమ లోనే ఒక విభిన్న స్వరం ఆయన, డైలాగ్స్‌ను స‌న్నివేశానికి త‌గిన విధంగా నొక్కి వ‌క్కాణించ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో డైలాగ్స్ ఏ స్ట‌యిల్‌లో చెబితే ప్రేక్ష‌కులకు రీచ్ అవుతుందో ఆ స్ట‌యిల్లో చెప్ప‌గ‌ల దిట్ట‌ డైలాగ్ కింగ్ మోహన్ బాబు.

520 చిత్రాల‌కు పైగా న‌టించి. ప్ర‌తినాయకుడిగా విల‌నిజాన్ని పండించిన మోహ‌న్‌బాబు అల్లుడుగారు, అసెంబ్లీరౌడీ, రౌడీ గారి పెళ్ళాం, పెద‌రాయుడు, మేజర్ చంద్ర‌కాంత్,పుణ్యభూమి నాదేశం... ఇలా 181 సినిమాల్లో హిరోగానూ తానేమిటో నిరూపించుకున్నారు.

నటుడు గా మోహన్ బాబు 2015 నవంబర్‌ 22 కి 40 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. 'స్వర్గం నరకం' చిత్రంతో హీరోగా ప్రేక్షకులకు పరిచయమైన మోహన్‌బాబు నలభై వసంతాల వేడుకల్లో భాగంగా ఏడాది పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మోహన్‌బాబు సినిమాల్లోని పాపులర్‌ డైలాగ్‌లన్నింటినీ ఒక బుక్‌గా తయారు చేశారు.

Mohan Babu Dialogue Book Launch in British Parliment

'డైలాగ్‌ బుక్‌' పేరుతో రూపొందించిన ఈ పుస్తకం ఈ నెల 11న బ్రిటన్‌ పార్లమెంట్‌ 'హౌస్‌ ఆఫ్‌ కామన్‌'లో ఆవిష్కరించబడనుంది. సాయంత్రం 6.30 నుంచి 8.30గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఏసియన్‌ లైట్‌ అనే సంస్థ, బ్రిటన్‌ పార్లమెంట్‌ సభ్యుడు బాబ్‌ బ్లాక్‌ మన్‌ సంయుక్తంగా డా||మోహన్‌బాబును సత్కరించనున్నారు.

అలాగే శ్రీ విద్యానికేతన్‌ విద్యాసంస్థను నెలకొల్పి అనేకమంది విద్యార్థులకు విద్య అందిస్తున్న మోహన్‌బాబుకు మార్చి 19న ఆయన పుట్టిన రోజు సందర్భంగా బెస్ట్‌ టీచర్‌ అవార్డుకూడా అందుకోనున్నారు మోహన్ బాబు. సినిమా రంగంలోనే కాకుండా తెలుగు వారికి అనేక మార్గాల్లో తన సహాయ సహకారాలను అందిస్తున్న డా.మోహన్‌ బాబు సేవలను గుర్తించి ఆయన్ను సత్కరిస్తున్నారు.

English summary
Celebrations for completion of Dr. M. Mohan Babu's 40 successful years in Telugu Cinema go global with his 'Dialogue Book' launch in British Parliment..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu