మోహన్ బాబు ఇంట్లో మళ్ళీ తళుక్ మన్న చిరంజీవి...!
ఆదివారం హైదరాబాద్ లో జరిగిన తారల సిసిఎల్ ఫైనల్ మ్యాచ్ వీక్షకులకు కావల్సినంత వినోదాన్నిచ్చింది. దక్షిణాది తారలతో పాటు బాలీవుడ్ తారలు కూడా హైదరాబాద్ విచ్చేయడంతో ఉప్పల్ స్టేడియం సినిమా తారలతో కళకళలాడింది. మ్యాచ్ అయిన తర్వాత నిన్నిలా సినిమా జనమంతా హైదరాబాదులోనే వున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్... అన్ని 'వుడ్' లకు చెందిన తారలూ నగరానికొచ్చి, హల్ చల్ చేశారు. కారణం, సీసీఎల్ (సెలెబ్రిటీ క్రికెట్ లీగ్) ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా జరగడమే. ఉప్పల్ స్టేడియంలో ఈ తారలంతా సందడి చేశారు. హీరోయిన్లయితే మరీనూ! ఈ సందర్భంగా మ్యాచ్ ముగిశాక సన్నిహిత సినీ ప్రముఖులకు ప్రముఖ నటుడు మోహన్ బాబు తన ఇంట్లో 'మాంచి' పార్టీ ఇచ్చారు.
ఈ పార్టీకి బాలీవుడ్ నుంచి శత్రుఘ్న సిన్హా, సుభాష్ ఘై, సోనాక్షి సిన్హా, కన్నడ పరిశ్రమ నుంచి అంబరీష్, సుమలత, టాలీవుడ్ నుంచి చిరంజీవి వంటి నిన్నటి తరం ప్రముఖులు విచ్చేశారు. ఈ పార్టీ సందర్భంగా శత్రుఘ్న సిన్హా తనయ సోనాక్షి సిన్హా ముచ్చటపడి తన డాడీ మిత్రులతో ఫోటో దిగింది. ఆ ఫోటోని ఈరోజు తను ట్విట్టెర్ లో పోస్ట్ చేసింది. అదే ఈ ఫోటో..ఇక పోతే చిరంజీవి మళ్ళీ మోహన్ బాబు ఇంట్లో మెరవడం ఓ విశేషం..ఈ విందు కార్యక్రమంలో అందరూ సినిమాల గురించి, రాజకీయాల గురించి మాట్లాడుకున్నారని సమాచారం..!


Click it and Unblock the Notifications











