నిజమా? మోహన్ బాబుకు ఆమె బూతు భాగోతం తెలీదా?
హైదరాబాద్: మోహన్ బాబు గురించి, ఆయన క్రమ శిక్షణ గురించి అందరికీ తెలిసిందే. ఆయన పిల్లలు విష్ణు, మనోజు, లక్ష్మీ ప్రసన్నకూడా చాలా సందర్భాలో తండ్రి క్రమ శిక్షణ గురించి చెప్పుకొచ్చారు. అయితే అలాంటి మోహన్ బాబు తమ సొంత బేనర్లో తెరకెక్కిన ‘కరెంటు తీగ' చిత్రంలో మాజీ పోర్న్ స్టార్ అయిన సన్నీ లియోన్ అనుమతించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.
అయితే ఈ విషయం గురించి మనోజ్ ను అడిగితే ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నాన్నకు సన్నీ లియోన్ గత జీవితం గురించి, ఆమె మాజీ పోర్న్ స్టార్ అనే విషయం అస్సలు తెలీదు అని వెల్లడించారు. సినిమా ఔట్ పుట్ చూసిన తర్వాత సన్నీ లియోన్ పెర్ఫార్మెన్స్ బాగుందని ప్రశంసించారట మోహన్ బాబు. మరి మనోజ్ చెబుతున్నట్లు సన్నీ లియోన్ బూతు భాగోతం గురించి ఆయనకు నిజంగానే తెలీదా?

మంచు మనోజ్, రాకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు, సన్నీ లియోన్ ప్రధాన పాత్ర ధారులుగా జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మాతగా 24 ఫ్రేమ్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘కరెంటు తీగ'. ఈ చిత్రం ఈ రోజు గ్రాండ్ గా విడుదలయింది.
సినిమాకు హీరో మంచు మనోజే అయినప్పటికీ....ఈసినిమాలో మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ నటిస్తుండటం, ఆమెపై స్పెషల్ సాంగ్ ఉండటం, ఈ సాంగ్ చాలా హాట్‌గా ఉంటుందని ప్రాచారం చేయడంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. సన్నీ లియోన్ తెలుగులో తొలిసారి నటిస్తుండటంతో ఆమె పెర్ఫార్మెన్ ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తసారుఅభిమానులు. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
సంపూర్ణేష్‌బాబు, ఫిరోజ్ అబ్బాసి, గిరిబాబు, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేష్, రఘుబాబు, జీవా, ఫిష్ వెంకట్, టార్జాన్, వెనె్నల కిశోర్, ధన్‌రాజ్, తా.రమేష్, సుప్రీత్, శివారెడ్డి, పృధ్వీ, సత్యకృష్ణ, కాదంబరి కిరణ్, గీతాంజలి, రవిశేఖర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:సతీష్ ముత్యాల, మాటలు:కిశోర్ తిరుమల, ఎడిటింగ్:ఎస్.ఆర్.శేఖర్, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, అనంత్ శ్రీరామ్, వరికుప్పల యాదగిరి, నిర్మాత:విష్ణు మంచు, దర్శకత్వం:జి.నాగేశ్వరరెడ్డి.


Click it and Unblock the Notifications











