twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విష్ణు గెలిచాడని ఆనందపడొద్దు... భయంకరమైన హమీలు ఇచ్చాడు .. చిరు, పవన్ పేరు చెబుతూ.. మోహన్ బాబు ఎమోషన్ స్పీచ్

    |

    మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే. మంచు విష్ణుకు 381 ఓట్లు రాగా, ప్రకాశ్ రాజ్‌కు 270 ఓట్లు లభించాయి. ఇక ప్రధాన కార్యదర్శి పదవికి పోటి చేసిన రఘుబాబు విజయం సాధించారు. ఆయనకు 340 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి జీవితకు 313 ఓట్లు పడ్డాయి. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రసిడెంట్ పోస్టుకు పోటీ చేసిన శ్రీకాంత్ విజయం సాధించారు. శ్రీకాంత్‌కు 375 ఓట్లు రాగా, బాబు మోహన్‌కు 269 ఓట్లు లభించాయి. ఇక కోశాధికారి పదవికి పోటీ చేసిన శివ బాలాజీకి 359 ఓట్లు లభించాయి. ఆయన ప్రత్యర్థి నాగినీడుకు 292 ఓట్లు పోలయ్యాయి. మంచు విష్ణు విజయాన్ని అధికారికంగా ప్రకటించిన తర్వాత మోహన్ బాబు మాట్లాడుతూ..

     విష్ణు బాబు విజయం అందరిదీ..

    విష్ణు బాబు విజయం అందరిదీ..

    విష్ణు బాబు విజయం ఏ ఒక్కరిది కాదు. ఇది అందరి విజయం. అందరూ మనవాళ్లే. ఓట్లు అటువైపు పడినా.. ఇటు వైపు పడినా బాబా ఆశీస్సులతో విజయం లభించాయి. సభ్యుల ఆశీస్సులతో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులతో ఆశీర్వాదంతో నా బిడ్డ గెలిచాడు. విష్ణు బాబు గెలుపు నేపథ్యంలో సంతోష పడటం కరెక్ట్ కాదు అని మోహన్ బాబు అన్నారు.

     గతం గత: అంటూ మోహన్ బాబు

    గతం గత: అంటూ మోహన్ బాబు

    మా ఎన్నికల ప్రచారంలో విష్ణు బాబు భయంకరమైన హామీలు ఇచ్చారు. వాటన్నిటిని వందశాతం విష్ణు మంచు నెరవేరుస్తాడు. చెప్పింది చెప్పినట్టు చేస్తాడు. నా బిడ్డ చేసిన హామీలే విజయం సాధించేందుకు దోహదపడ్డాయి. గతం గత: ఇప్పటి వరకు జరిగిన విషయాలను మరిచిపోదాం. అందరం ఒక తల్లి బిడ్డలం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అని మోహన్ బాబు అభిప్రాయపడ్డారు.

     ఎవరూ మీడియా ముందు మాట్లాడొద్దు

    ఎవరూ మీడియా ముందు మాట్లాడొద్దు

    నాకు నటుడిగా జన్మనిచ్చిన దాసరి ఏ లోకాన ఉన్నాడో ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. నా విజయం వెనుక ఎందరో నిలచున్నారు. ఇక నుంచి మా ఎన్నికలు ఏకగ్రీవంగా జరగాలి అని మనస్పూర్తిగా కోరుకొంటున్నాను. ఇక నుంచి అన్ని వివాదాలకు ముగింపు పలకాలి. ఇక నుంచి ఎవరూ కూడా మీడియా ముందుకు వెళ్లి మాట్లాడకూడదు. ప్రసిడెంట్ విష్ణు అనుమతి తీసుకొని మాట్లాడాలి అని మంచు మోహన్ బాబు తెలిపారు.

    రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆశీస్సులు

    రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆశీస్సులు

    మా ఎన్నికల్లో సాధించిన గెలుపు అందరి విజయం. నా బిడ్డకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆశీస్సులు ఉండాలి. అందరి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు నా బిడ్డకు ఉంటాయని ఆశిస్తున్నాను. ముఖ్యంగా నా తమ్ముడు నరేష్ నా బిడ్డ విజయం కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. అందుకు ధన్యవాదాలు. 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని కోరుకొంటున్నాను అని మోహన్ బాబు పేర్కొన్నారు.

    Recommended Video

    MAA Elections : Chiranjeevi VS Mohanbabu మధ్య ఎన్నికలుగా Mind Game | PrakashRaj || Filmibeat Telugu
    నాగ్, చిరు, పవన్ ఆశీస్సులతోనే...

    నాగ్, చిరు, పవన్ ఆశీస్సులతోనే...

    మా ఎన్నికల సమయంలో చాలా మంది నాకు తెలియదు. కానీ నా ఆఫీస్‌కు వచ్చి 24 గంటలు కష్టపడ్డారు. వారి భార్యబిడ్డలను మరిచిపోయి విష్ణు విజయానికి కృషి చేశారు. వారందరికి నా ధన్యవాదాలు. నా సోదరుడు నాగార్జున, నా మిత్రుడు చిరంజీవి, పవన్ కల్యాణ్ ఆశీస్సులు ఉన్నాయి. ఇది అందరి విజయం అంటూ మోహన్ బాబు ప్రసంగించారు.

    English summary
    MAA Elections 2021: Mohan Babu Emotiona speech after Vishnu Manchu victory in MAA Elections 2021 Vishnu Manchu elected as MAA President. Prakash lost with 111 Votes. In this occassion, Prakash Raj congratulated the Vishnu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X