నరరూప రాక్షసులను పట్టుకోవాలి... ప్రకృతి ఎవరినీ విడిచిపెట్టదు.. మోహన్‌బాబు
Recommended Video

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య తెలుగు రాష్టాల్లో సంచలనం రేపింది. ఈ ఘటనపై నటుడు మంచు మోహన్‌బాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హత్యలో నిజాలను ప్రభుత్వం బయటపెట్టాలని కోరారు. వైఎస్ వివేకానందరెడ్డికి మోహన్ బాబు బంధువు అనే సంగతి తెలిసిందే. వైఎస్ వివేకా భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

చాలా బాధగా ఉందని
వివేకానంద రెడ్డి మరణం చూస్తే చాలా బాధగా ఉంది. ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఎక్కడ పుల్‌స్టాప్ పడుతుందో తెలియడం లేదు. అరాచకాలేంటి? ఘోరాలేంటి? ఎవరు ఎందుకు చేస్తున్నాడో భగవంతుడు చూస్తున్నాడు. ప్రకృతి ఎవరినీ విడిచిపెట్టదు.

అజాతశత్రువుకే ఇలాంటి దుర్గతియా?
వివేకానంద రెడ్డి అజాత శత్రువు, ధర్మరాజులాంటి వాడు. ఇతరులకు కీడు తలపెట్టడు. పదిమందికి సహాయం చేసే వ్యక్తి చాలా మంది, ఇతర పార్టీల వారు చెబితే ఆశ్చర్యపోయాడు. వివేకానంద లాంటి మంచి వ్యక్తికే అలా జరిగిందంటే బాధగా ఉంది. ఈ హత్య వెనుక నిజాలు భగవంతుడికి తెలుసు. పోలీసులు నిష్ఫక్షపాతంగా దర్యాప్తు చేయాలి.

ఏ వ్యక్తికి కూడా జరుగకూడదు
వివేకానంద హత్యకు పాల్పడిన రాక్షసులను తొందర్లోనే పట్టుకోవాలి అని పోలీసులను హృదయపూర్వకంగా వేడుకొంటున్నాను. నా బంధువని కాదు.. ఏ వ్యక్తికి కూడా ఇలాంటిది జరుగకూడదు. ఈ రోజు పక్షపాతం చూపిస్తే ప్రతీ ఒక్కరి జీవితంలో పగలు రాత్రి ఉంటుంది. నా ఆత్మీయుడు, ఆత్మబంధువుడుకి ఇలా జరగడం చాలా షాకింగ్‌గా ఉంది.

నరరూప రాక్షసులను పట్టుకోవాలి
ఏ భేషజాల లేని వ్యక్తి. మంచి వ్యక్తి నిరాడంబరుడైన వివేకానందరెడ్డిని పొట్టనపెట్టుకొన్న నరరూప రాక్షసులను తొందర్లోనే పట్టుకోవాలని పోలీసు, ప్రభుత్వ శాఖను కోరుకొంటున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని మోహన్‌బాబు ఆవేదన చెందారు. మంచు విష్ణుతోపాటు ఆయన భార్య వెరినికా రెడ్డి వివేకానంద భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. వెరోనికా రెడ్డికి వివేకానందరెడ్డి పెదనాన్న అనే విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











