twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీచులు, నికృష్ఠులు, నాశనం అయిపోతారు, ఏడుపొస్తోంది.... మోహన్ బాబు సెన్సేషన్ కామెంట్స్

    By Bojja Kumar
    |

    Recommended Video

    నీచులు, నికృష్ఠులు, నోట్లో ఒకరి నోరు పెట్టి ముద్దులు....!

    మోహ‌న్‌బాబు న‌టిస్తూ నిర్మించిన చిత్రం గాయ‌త్రి. మ‌ద‌న్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌లైంది. బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకున్న నేపథ్యంలో చిత్ర బృందంతో మోహన్ బాబు మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

     నిర్మాతగా నా హృదయం ఏడుస్తోంది

    నిర్మాతగా నా హృదయం ఏడుస్తోంది

    నిర్మాతగా ఓ విషయంలో నా హృదయం ఏడుస్తూ ఉంది. కళ్లలో నీరు కూడా రావడం లేదు. ఆ విషయం చెప్పడానికే వచ్చాను. నిర్మాత కష్టసుఖాలు జర్నలిస్టులకు, ప్రజలకు చాలా మందికి తెలుసు. నా లాంటి వారు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారు. కొందరు బయటకు రాలేక, వచ్చినా వినేవారు లేక అలా ఉన్నారు. నే చెప్పినా వింటారా? అంటే.... మోహన్ బాబు 42 సంవత్సరాల నట జీవితం ఉంది, నేను చెబితే కొంత మంది చెవుల్లోకి వెళుతుందనే ఉద్దేశ్యంతో చెబుతున్నాను... అంటూ పైరసీ గురించి మోహన్ బాబు వ్యాఖ్యానించారు.

     రిలీజ్ రోజే ఇంటర్నెట్లో పెట్టారు

    రిలీజ్ రోజే ఇంటర్నెట్లో పెట్టారు

    సినిమా రిలీజ్ అయిన వెంటనే ఇంటర్నెట్లో పెట్టారు. ఈ విషయమై అమెరికా నుండి ఫోన్లు వచ్చాయి. సినిమా తీసే వాడికి కూడా తల్లి, తండ్రి ఉంటారు. పెళ్లి చేసుకుని ఉంటే భార్య బిడ్డలు ఉంటారు. ఒకరికి ద్రోహం చేస్తే స్వర్గం నరకం ఇక్కడే ఉంటుంది. తాత్కాలికంగా బావుండొచ్చు. కానీ చేసిన పాపానికి నాశనం అయిపోతారు... అంటూ పైరసీ చేసిన వారిపై మోహన్ బాబు మండి పడ్డారు.

    9 నెలలు కష్టపడ్డాను

    9 నెలలు కష్టపడ్డాను

    నిర్మాతగా, నటుడిగా గాయిత్రి సినిమాకు 9 నెలలు కష్టపడ్డాను. చేయి ఆపరేషన్, నీ మరో ఆపరేషన్ జరిగింది. శరీరం ఎంత కష్టపడిందో దర్శకుడికి తెలుసు. నా వయసు మీకు తెలుసు. చేయకూడని ఫైట్స్ రిస్క్ తీసుకుని చేశాను. నేను నటుడిని అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఆశీస్సులు, దర్శకుల ఆశీస్సులు, నటీనటులు, టెక్నీషియన్స్ ఆశీస్సులతో ప్రూవ్ చేసుకున్నాను. భగవంతుడు చల్లగా చూడబట్టే ఈ విధంగా ఉన్నాం. నేను, నా బిడ్డలు, కుటుంబం పది మందికి సహాయం చేయగలుగుతున్నాం. విఆర్ సక్సెస్ ఫుల్, వ్యాపారంలో ఫెయిల్యూర్స్ అనేది సహజం అది వేరు.... అని మోహన్ బాబు అన్నారు.

    ఎన్నోసార్లు బెగ్గింగ్, బెగ్గింగ్ అన్నాను

    ఎన్నోసార్లు బెగ్గింగ్, బెగ్గింగ్ అన్నాను

    ఎన్నో సార్లు బెగ్గింగ్ బెగ్గింగ్ అన్నాను ఆ దొంగలను. దొంగలారా...స్నేహితులారా, నీచురాలా, పోరంబోకులారా, దుర్మార్గులారా అని పైరసీ చేసే వారిని మన నోటితో అనక్కర్లేదు. అపవిత్రం అవుతుంది. ఒకతల్లికి పుట్టావు ఆ తల్లి మహాతల్లి. తల్లి జన్మనిస్తుంది. కానీ తలరాతను ఇవ్వను. వాడిని దుర్మార్గుడిగా బ్రతకమని ఏ తల్లీ చెప్పదు. పైరసీ చేస్తుంటే నిర్మాతగా నా హృదయం ఏడుస్తోంది.... అని మోహన్ బాబు అన్నారు.

    పైరసీ చూసే వారు కూడా నీచులే, నికృష్ఠులే... నాశనం అయిపోతారు

    పైరసీ చూసే వారు కూడా నీచులే, నికృష్ఠులే... నాశనం అయిపోతారు

    అయ్యా ప్రేక్షకులారా మీకు రిక్వెస్ట్. మీరు పైరసీ చూడొద్దు. ఇలా నీచాతి నీచంగా డీవీడీలు, పైరసీలు చూస్తే.... భవంతుడు ఉన్నాడని నమ్ముతున్నాం. కొందరు నమ్మడం లేదు. ఏదో ఒక శక్తి మనల్ని సృష్టించింది. సర్వనాశనం చేస్తుంది. ఎదుటివాడు చెడిపోవాలి చెడిపోవాలి అని మన మనసులో అనుకుంటే మన మొహం పాడైపోతుంది వాడికంటే ముందు మనమే చనిపోతాం. ఇటువంటి నికృష్టమైన బ్రతుకు బ్రతుకుతున్నటు వంటి తీసినవాళ్లు, దాన్ని చూసి ఎంకరేజ్ చేస్తున్న మహా నికృష్ఠుడు ఉంటే దేశం, ఇండస్ట్రీ ఎక్కడ ముందుకు వెళుతుంది. ప్రపంచ దేశాల్లో కూడా అక్కడక్కడ పైరసీ వచ్చినా ఇంత ఘోరంగా రావు.... అని మోహన్ బాబు అవేదన వ్యక్తం చేశారు.

    ఏ రాజకీయ పార్టీకాదు

    ఏ రాజకీయ పార్టీకాదు

    సినిమాలో కొన్ని రాజకీయ డైలాగులు ఉన్నాయి. అలా అని నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. పేపర్లలో వచ్చే వార్తలతో ఇన్స్ స్పైర్ అయి సినిమాల్లో కొన్ని చలోక్తులు, డైలాగులు పెడతాం తప్ప ప్రస్తుతానికి, ఈ రోజు వరకు నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. సమయం వచ్చినపుడు ఏ పార్టీకి చెందిన వాడినో చెబుతాను.... అని మోహన్ బాబు అన్నారు.

    అలాంటివి చూసే ఆడవారికి చెప్పేది ఒకటే

    అలాంటివి చూసే ఆడవారికి చెప్పేది ఒకటే

    నా భార్యతో పాటు కొంత మంది ఆడపడుచుకులకు ఓ విషయం చెప్పదలుచుకున్నాను. టీవీలో సీరియల్ వస్తే అంకితం అయిపోతున్నారు. కొన్ని టీవీల్లో ఆడ పడుచును ఇంకో ఆడ పడుచుకు శత్రువుగా చూపిస్తున్నారు. ఎక్కువ టీవీ సీరియల్స్ లో ఆడవారినే విలన్స్ గా చూపిస్తున్నారు. అటువంటివే ఎక్కువగా చూస్తున్నారు.... అంటూ టీవీ సీరియల్స్‌కు అడిక్ట్ అయిపోయిన మహిళా లోకాన్ని ఉద్దేశించి మోహన్ బాబు కామెంట్ చేశారు.

    మా సినిమాలో ముద్దులు లేవు, మంచి నీతి ఉంది

    మా సినిమాలో ముద్దులు లేవు, మంచి నీతి ఉంది

    మా సినిమాలో ఒక తండ్రి ఎంత ఆవేదన పడ్డాడు 25 సంవత్సరాలు ఆ బిడ్డను చూడకుండా, ఒక ప్రియురాలు ఒక ప్రియుడిని ఎలా ప్రేమించి అతడిని మంచి దారిలో పెట్టింది ఒక నీతి వంతమైన చిత్రం. చూడదగినటువంటి చిత్రం. ఒకరి నోట్లో ఒకరి నోరు పెట్టి ముద్దులు రహస్యంగా పెట్టుకోవాలేకానీ పబ్లిక్ గా పెట్టుకోకూడదు. మా చిత్రంలో ముద్దులు మాత్రం లేదు. ఇంటిల్లిపాది వెళ్లి చూడదగ్గ మూవీ, ప్రతి జనరేషన్ చూడదగిన చిత్రం. చూడాలని కోరుకుంటున్నాను... అని మోహన్ బాబు అన్నారు.

    మీ అభిమానం ఇలాగే ఉండాలి

    మీ అభిమానం ఇలాగే ఉండాలి

    `గాయ‌త్రి` సినిమాలో మంచు విష్ణు న‌ట‌న‌కు న‌టుడిగా మంచి పేరొచ్చింది. విష్ణు త‌న‌దైన ఇన్‌వాల్వ్‌మెంట్‌తో అంద‌రి చేత శ‌భాష్ అనిపించుకున్నాడు. క‌లెక్ష‌న్స్ ఒక‌చోట ఎక్కువ‌గా , మరో చోట త‌క్కువ‌గా ఉండొచ్చు. కానీ నిర్మాత‌గా సేఫ్ అయ్యాను. తండ్రి, కూతురి మ‌ధ్య అనుబంధాన్ని తెలియ‌జేసే సినిమా ఇది. ఇంత‌కు ముందు చాలా హిట్స్ వ‌చ్చినా.. ఈ సినిమాకు వ‌చ్చిన అభినంద‌న మ‌రో సినిమాకు రాలేదు. ప్రేక్ష‌కుల అభిమానం ఇలాగే ఉండాల‌ని కోరుకుంటున్నాను... అని మోహన్ బాబు` అన్నారు.

    English summary
    Mohan Babu Emotional Speech at Gayathri Movie Success Meet on piracy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X