ఒకే గర్భాన జన్మించలేదు.. బాలయ్య కొన్ని యాంగిల్స్‌లో.. మోహన్ బాబు ఎమోషనల్‌గా!

Recommended Video

NTR Kathanayakudu : Mohan Babu Tweets On The Movie | Filmibeat Telugu

బాలయ్య నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం విడుదల కావడంతో సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రంలో బాలయ్య తన తండ్రి పాత్రలో నటించాడు. దీనితో భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిమ్మకూరు గ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించిన ఎన్టీఆర్ తెలుగు ప్రజలు ఆరాధించే స్టార్ గా ఎలా ఎదిగారు అనే విషయాలు కథానాయకుడు చిత్రంలో చూపించనున్నారు. ఈ చిత్ర విడుదల సందర్భంగా సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఒకే గర్భాన జన్మించలేదు

ప్రముఖ నటుడు మోహన్ బాబు స్వర్గీయ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. మోహన్ బాబు నిర్మాణంలో ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ చిత్రంలో నటించారు కూడా. ఎన్టీఆర్ ని మోహన్ బాబు ఎప్పుడూ తన సోదరుడిగానే భావిస్తారు. తాజాగా మోహన్ బాబు ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ రామారావుగారు నాకు అన్నయ్య.. ఒకే గర్భాన జన్మించకపోయిన మేమిద్దరం అన్నదమ్ములం అని చెప్పిన మహానుభావుడు ఎన్టీఆర్ అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.

మామూలు విషయం కాదు

ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కించడం మామూలు విషయం కాదు. అలాగే ఆయన తనయుడు బాలయ్య తండ్రి పాత్రలో నటించడం కూడా మామూలు విషయం కాదు. ఇది కష్టమైన పని అయినప్పటికీ మంచి దర్శకుడు చేతిలో పడింది. ఈ చిత్ర ఆడియో వేడుకకు నేను కూడా వెళ్ళాను. కొన్ని సన్నివేశాలు చూశా. అన్నయ్య మళ్ళీ పుట్టాడా అని అనిపించింది అని మోహన్ బాబు అన్నారు. బాలయ్య సాధారణంగానే కొన్ని యాంగిల్స్ లో తండ్రి పోలికలతో ఉంటాడు అని మోహన్ బాబు అన్నారు.

అన్ని సినిమాలు

ఎఫ్2 చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ట్విట్టర్ వేదికగా స్పందించారు. మా చిత్రం ఎఫ్2 తో పాటు సంక్రాంతికి విడుదలవుతున్న ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయ రామ చిత్రాలు కూడా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాము అని దిల్ రాజు సంస్థ వెంకటేశ్వర క్రియేషన్స్ చేసిన ట్వీట్ ని అనిల్ రావిపూడి రీ ట్వీట్ చేశారు.

ఎదురు చూడలేకున్నా

ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం కోసం ఎదురుచూడలేకున్నా. ఈ చిత్రానికి మంచి విజయం చేకూరాలి అని సంగీత దర్శకుడు థమన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

క్రిష్, బాలయ్య మ్యాజిక్

లెజెండరీ ఎన్టీఆర్ జీవిత చరిత్ర కోసం ఎదురుచూస్తున్నా. దర్శకుడు క్రిష్, నందమూరి బాలకృష్ణ మ్యాజిక్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది అంటూ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ట్విట్టర్ లో తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X