»   » మనోజ్ పెళ్లి: మోడీని కలిసిన మోహన్ బాబు ఫ్యామిలీ (ఫోటోస్)

మనోజ్ పెళ్లి: మోడీని కలిసిన మోహన్ బాబు ఫ్యామిలీ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సిని నటుడు మోహన్ బాబు, ఆయన కుమార్తె మంచు లక్ష్మి, కుమారులు మంచు విష్ణు, మనోజ్  ప్రధానమంత్రి నరేంద్రమోడీని మంగళవారం ఢిల్లీలో కలిసారు. తన చిన్న కుమారుడైన మంచు మనోజ్‌ వివాహానికి రావాలని మోహన్‌బాబు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ...మోడీని కలవడం ఆనందంగా ఉందన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని, చాలా ఏళ్ల క్రితమే తనకు బీజేపీ నుండి ఆహ్వానం వచ్చిందన్నారు. మోడీని కలవడం గర్వంగా ఉందని మనోజ్, విష్ణు, మంచు లక్ష్మి వ్యాఖ్యానించారు.

ఇటీవలే మనోజ్ నిశ్చితార్థం ప్రణతి రెడ్డితో జరిగిన సంగతి తెలిసిందే. మార్చి 4, ఉదయం 10.30 గంటలకు ఎంగేజ్మెంట్ జరిగింది. మనోజ్-ప్రణతి వివాహానికి పురోహితులు మే 20వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. మే 20వ తేదీ ఉదయం 9.10 గంటలకు వీరి వివాహం జరగనుంది. మరో విశేషం ఏంటంటే మనోజ్ పుట్టిన రోజు కూడా మే 20వ తేదీయే. ప్రణతి రెడ్డిని మనోజ్ ప్రేమ వివాహం చేసుకుంటున్నాడు.

కాబోయే కోడలి గురించి మోహన్ బాబు స్వయంగా వెల్లడించారు ''మా పెద్ద కోడలు విరానికా, ప్రణతి ఇద్దరూ క్లాస్ మెట్స్. ఆ విధంగా ప్రణతి తల్లిదండ్రులకూ, మా కుటుంబానికీ పరిచయం ఏర్పడింది. ప్రణతి బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివింది. ఆ తర్వాత న్యూయార్క్ లో సీపీఎ (అమెరికాలో చార్టెడ్ ఎకౌంట్ ని సిపీఎ అంటారు) చేసింది. రెండు రోజుల క్రితం ప్రణతి తల్లిదండ్రులు సత్యనారాయణ, ప్రవీణలను కలిసి వివాహ విషయం మాట్లాడాం. మీ అందరి ఆశీస్సులతో ఈ పెళ్లి జరుగుతుంది'' అని చెప్పారు.

మోడీ మోహన్ బాబు

మోడీ మోహన్ బాబు

ప్రధాని నరేంద్ర మోడీ, మోహన్ బాబు ఆత్మీయ ఆలింగనం.

పెళ్లి శుభలేఖ

పెళ్లి శుభలేఖ

తన పెళ్లి శుభలేఖని మోడీకి అందజేస్తున్న మంచు మనోజ్

మోడీతో మంచు లక్ష్మి సెల్ఫీ

మోడీతో మంచు లక్ష్మి సెల్ఫీ

మోడీతో మంచు లక్ష్మి సెల్ఫీ....

మంచు విష్ణు

మంచు విష్ణు

ప్రధాని మోడీతో కరచాలనం చేస్తున్న మంచు విష్ణు

English summary
Telugu Actor Mohan Babu Family meets our honorable PM Narendra Modi at Delhi.
Please Wait while comments are loading...