మోహన్ బాబు పుట్టపర్తి బాబాను ఫాలో అవుతున్నారా?
పుట్టపర్తి సాయిబాబా గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతను దేవుడా? కాదా? అనే విషయం పక్కన పెడితే అతని లైఫ్ స్టయిల్ ఓ రేంజ్‌లో ఉండేది. బాబా పుట్టిన రోజు వేడుకలైతే ఓ పండగలా నిర్వహిస్తారు. ఆ రోజున సత్యసాయి గ్రూపు ఇనిస్టిట్యూట్లలో చదవే విద్యార్థులందరనీ జమచేసి బాబా కోసం వారితో ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించేవారు.
తాజాగా సినీ నటుడు మోహన్ బాబు కూడా బాబా తరహాలోనే పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారనే వాదన తెరపైకి వచ్చింది. మోహన్ బాబు తిరుపతిలో నిర్వహిస్తున్న శ్రీ విద్యానికేత్ విద్యా సంస్థలకు సంబంధించిన విద్యార్థులను మోహన్ బాబు పుట్టిన రోజు వేడుకల కోసం గ్యాదర్ చేసి, వారితో వివిధ కార్యక్రమాలు చేయించారని, ఈ తంతు సత్యసాయి పుట్టిన రోజు వేడుకలను తలపించాయని అంటున్నారు. సత్యసాయికి పుట్టపర్తిలా.....మెహన్ బాబు తిరుపతిని అలా భావిస్తుంటారని, అందుకే ఎక్కువ సమయం అక్కడే గడుపుతున్నాడని అంటున్నారు.
ప్రస్తుతం మెహన్ బాబు 'జగద్గురు ఆది శంకరాచార్య' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన 'రుద్రాక్షస్వామి'గా కనిపించి అలరించనున్నారు. రచయిత జేకే భారవి దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో టైటిల్ రోల్‌లో కౌశిక్‌బాబు నటిస్తున్నారు. గ్లోబల్ పీస్ క్రియేటర్స్ పతాకంపై నారా జయశ్రీదేవి నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే తెలుగు తెరపై హేమాహేమీలంతా ఈ చిత్రంలో నటిస్తున్నారు. వారిలో ముఖ్యంగా నాగార్జున, శ్రీహరి, ప్రకాష్‌రాజ్, జయప్రద, రోజా, మీనా, పోసాని కృష్ణమురళి, విజయ్‌చందర్, కామ్నా జఠ్మలాని, ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర కూడా కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











