అల్లు వారి తరువాత మంచు వారి వంతు.. మహానటి టీంకు సత్కారం!
ఇటీవల మహానటి చిత్ర యూనిట్ అల్లు అరవింద్ నుంచి ఘనమైన సత్కారాన్ని పొందింది. మహానటి చిత్రం విడుదలై మంచి వసూళ్లు సాధిస్తూ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులని ఈ చిత్రం అలరిస్తోంది. లెజెండరీ నటి సావిత్రిగారి జీవితాన్ని ఎలా చూపించారు అనే ఆసక్తి సగటు ప్రేక్షకుడిలో నెలకొని ఉంది.
అల్లు అరవింద్ ఓ పార్టీ నిర్వహించి మరీ మహానటి చిత్ర యూనిట్ ని సత్కరించారు. ఈ పార్టీకి దర్శక ధీరుడు రాజమౌళి, అల్లు అర్జున్, హరీష్ శంకర్ వంటి వారు హాజరయ్యారు. ఇప్పుడు మంచి వారి వంతు వచ్చింది. మోహన్ బాబు మహానటి చిత్రాన్ని ప్రత్యేకంగా చూసిన తరువాత చిత్ర యూనిట్ ని సత్కరించారు. దర్శకుడు నాగ అశ్విన్, ప్రియాంక దత్, స్వప్న దత్ హాజరయ్యారు. మంచు విష్ణు కూడా అక్కడే ఉన్నారు.

మోహన్ బాబు ఈ చిత్రంలో కామియో రోల్ లో మెరిసిన సంగతి తెలిసిందే. ఆయన దిగ్గజ నటుడు ఎస్వీ రంగారావు పాత్రలో మెరిశారు. మహానటి చిత్రానికి సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. నాగ అశ్విన్ దర్శకత్వ ప్రతిభకు అంతా నీరాజనాలు పడుతున్నారు.


Click it and Unblock the Notifications











