Mohan Babu: బుద్ధి లేదా.. ఉద్యోగాలు తీయిస్తా.. మీడియాపై మోహన్ బాబు ఫైర్

కలెక్షన్ కింగ్, నటుడు, హీరో, విలన్ గా గుర్తింపు పొందారు మోహన్ బాబు. విలక్షణ నటుడిగా, తనదైన డిఫరెంట్ మ్యానరిజం డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. 90వ దశకంలో ఆయన హీరోగా చేసిన పలు హిట్ సినిమాలకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ అలరిస్తున్నారు. ఇక ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె సినీ ఇండస్ట్రీలో తమదైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవల వాళ్ల మధ్య మనస్పర్థలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మీడియాపై తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు మోహన్ బాబు. ప్రస్తుతం ఈ టాపిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా విలన్ గా గుర్తింపు పొంది కలెక్షన్ కింగ్ అని పేరు తెచ్చుకున్నారు మోహన్ బాబు. ఆయన డైలాగ్ డెలీవరి విభిన్నంగా ఉండటమే కాకుకండా ఎంతోమంది అభిమానులను సంపాదించిపెట్టింది. ఇదిలా ఉంటే మోహన్ బాబు ముగ్గురు పిల్లలు ఇండస్ట్రీలో నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఆయన కుటుంబానికి సంబంధించిన విషయాలు బహిర్గతం అయ్యాయి. ఆయన కుమారులు మంచు మనోజ్, విష్ణు మధ్య గొడవలు ఉన్నట్లుగా ఓ వీడియో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.

Mohan Babu Fires On Media At Shadnagar Comment Goes Viral

మంచు మనోజ్, విష్ణు గొడవపై ఇదివరకు మీడియా ప్రశ్నలు అడగ్గా.. తనదైన శైలీలో సమాధానం ఇచ్చి వివాదం అయ్యారు. ఇప్పుడు తాజాగా మరోసారి మోహన్ బాబు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. మీడియాపై తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. తాజాగా మోహన్ బాబు షాద్ నగర్ రిజిస్ట్రేష్ కార్యాలయానికి వెళ్లారు. మోహన్ బాబు అక్కడికి వెళ్లారన్న సమాచారంతో మీడియా కాపు కాసింది. బయటకు వచ్చిన మోహన్ బాబుకు మీడియా కనపడటంతో ఆవేశం తెచ్చుకున్నారు.

మీడియాను చూసిన మోహన్ బాబు.. "బుద్ధి లేదా?, సిగ్గులేదా?.. ఉద్యోగాలు తీయించేస్తా.. ఆ లోగోలు లాక్కొండి" అంటూ తన బాడీగార్డ్సుతో చెప్పారు. దీంతో మోహన్ బాబు వైఖరీపై మీడియా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ పై చర్చ నడుస్తోంది. అయితే మోహన్ బాబు ఉన్నఫలంగా షాద్ నగర్ రిజిస్టేషన్ కార్యాలయానికి ఎందుకు వెళ్లారని ఆరా తీస్తున్నారు. అక్కడ ఆయనకు కొన్ని ల్యాండ్స్ తోపాటు ఫామ్ హౌజ్ లు ఉన్నట్లు సమాచారం. వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనుల కోసం మోహన్ బాబు షాద్ నగర్ వెళ్లినట్లుగా టాక్. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X